రూ.4 వేలకే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ | Swipe Launches Elite 4G In India; Available Exclusively On Flipkart | Sakshi
Sakshi News home page

రూ.4 వేలకే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌

Published Wed, Aug 16 2017 5:30 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

రూ.4 వేలకే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ - Sakshi

రూ.4 వేలకే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌

పూణె(మహారాష్ట్ర): స్వైప్‌ టెక్నాలజీస్‌ సరసమైన ధరలో ఓ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. రూ.3,999కే స్వైప్‌ ఎలైట్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లోనే లభ్యం కానుంది. నలుపు, బూడిద, బంగారం రంగులలో ఈ ఫోన్‌ మార్కెట్‌లో లభించనున్నట్టు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీపాల్‌ గాంధీ తెలిపారు. భారతీయ వినియోగదారులను అనుగుణంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై యాక్సిస్‌ బ్యాంకు బుజ్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు 5 శాతం తగ్గింపును కూడా కంపెనీ ఇవ్వనుంది. గత వారమే స్వైప్‌, ఎలైట్‌ వీఆర్‌ అనే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ప్రస్తుతం 4జీ యూజర్లను టార్గెట్‌గా చేసుకునే ఎలైట్‌ 4జీ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. 
 
ఫోన్‌ ప్రత్యేకతలు:
ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌మాలో 
1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌
5 అంగుళాల హెచ్‌డీ ఎఫ్‌డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే
8 మెగా పిక్సెల్‌ వెనుక కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌ 
5 మెగా పిక్సెల్‌ ముందు కెమెరా
1 జీబీ ర్యామ్‌
8జీబీ స్టోరేజ్‌, 64 జీబీ వరకు విస్తరణ మెమరీ 
గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌
2500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
4జీ వాయిస్‌ ఓవర్‌ ఎల్టీఈ
డ్యూయల్‌ సిమ్‌(మైక్రో+నానో)
3.5ఎంఎ ఆడియో జాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement