ఇక ఆర్టీసీలోనూ క్యాష్‌లెస్!
మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట జోన్: దేశంలోనే తొలిసారిగా ఆర్టీసీలో నగదు రహిత లావాదేవీలతో ప్రయాణికులకు సేవలందించేందుకు ఓ కొత్త ఒరవడికి సిద్దిపేట నాందిగా నిలిచిం దని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట డిపో పరిధిలోని 139 మంది కండ క్టర్లకు ఆదివారం ఆయన స్వైపింగ్ మిషన్లను అందజేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలందరికీ ఇబ్బందులు ఎదురయ్యాయ న్నారు. దీంతో పరోక్షంగా సిద్దిపేట డిపో రూ.80 లక్షల ఆదాయం కోల్పోయిందన్నా రు. ప్రయాణికులకు చిల్లర సమస్య ఉత్ప న్నం కాకుండా ఉండేందుకు సిద్దిపేటను నగదురహిత లావాదేవీల నియోజకవర్గంగా మార్చుతున్నామన్నారు. ఆర్టీసీలో స్వైపింగ్ ద్వారా టికెట్ల ప్రక్రియ పారదర్శకతకు దోహదపడుతుందన్నారు. నగదురహిత లావాదేవీల నిర్వహణకు చైతన్యగడ్డగా పేరుపొందిన సిద్దిపేటను సీఎం కేసీఆర్ ఎంచుకుని.. ఈ ప్రాంత ప్రజలకు మంచి అవకాశాన్ని కల్పించారన్నారు. నగదురహిత లావాదేవీల నిర్వహణకు రూ.55 లక్షలను వెచ్చించామని, దీన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయలన్నారు.
మంత్రి, చైర్మన్ క్యాష్‌లెస్ ప్రయాణం
స్థానిక పాత బస్టాండ్ వద్ద సిద్దిపేట డిపోకు చెందిన బస్సులో మంత్రి హరీశ్‌రావు, ఆర్టీసీ సంస్థ చైర్మన్ సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మరో 10 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రయాణించారు. సిద్దిపేట నుంచి దుబ్బాకకు ఒక్కొక్కరికి రూ.16 చొప్పున 8 మంది టిక్కెట్లను మంత్రి హరీశ్‌రావు స్వైపింగ్ ద్వారా క్యాష్‌లెస్ పద్ధతిలో కండెక్ట ర్ బాలాజీరావుకు అందించి టికెట్లు తీసుకు న్నారు. మంత్రి దుబ్బాకలోని అభివృద్ధి కార్యక్రమానికి బస్సులోనే వెళ్లారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హన్మం తరావు, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, టీఎంయూ జిల్లా నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, వెంకట్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
హరీశ్‌ను రోల్‌మోడల్‌గా నిలుపుదాం
దూరదృష్టితో సీఎం కేసీఆర్ సిద్దిపేటను నగదురహిత లావాదేవీల నియోజకవర్గంగా మార్చేందుకు కృషి చేస్తున్నారని, ఆర్టీసీ కార్మికులు క్యాష్‌లెస్ విధానానికి సహకరించి హరీశ్‌ను రోల్ మోడల్‌గా నిలపాలని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. హరీశ్‌రావు మాట అంటే అది రూలేనన్నారు.