అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్లు తీసుకునే ప్రయాణికులకు స్వైప్ మిషన్ల ద్వారా టికెట్లు జారీ చేయాలని రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మాలకొండయ్య అన్నారు.
స్వైప్ మిషన్ల ద్వారా ఆర్టీసీ రిజర్వేషన్ టికెట్లు
Published Sat, Nov 26 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
– ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య
కర్నూలు(రాజ్‌విహార్): అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్లు తీసుకునే ప్రయాణికులకు స్వైప్ మిషన్ల ద్వారా టికెట్లు జారీ చేయాలని రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మాలకొండయ్య అన్నారు. శనివారం ఆయన విజయవాడలోని ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా టికెట్లు కూడా నగదు రహితంగానే జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ముందుగా రిజర్వేషన్ కౌంటర్లతో పాటు ఏటీబీ(అథరైజ్డ్ టికెట్ బుకింగ్) ఏజెంట్ల వద్ద కూడా స్వైప్ మిషన్లు ఉండేలా చూడాలన్నారు. వీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలో ముందుగా అంచనా వేసుకొని అందుక తగ్గట్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో రీజినల్ మేనేజర్ గిడుగు వెంకటేశ్వరరావుతో పాటు డీసీటీఎంలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement