జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యం రూ.750 కోట్లు
Published Tue, Aug 23 2016 10:21 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ సాయిప్రసాద్
రామచంద్రపురం :
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ లక్ష్యం రూ.750 కోట్లు అని ఆ శాఖ డీఐజీ ఎం.సాయిప్రసాద్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆయన రామచంద్రపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందరం్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో గత ఏడాది ఆదాయ లక్ష్యం రూ.530 కోట్లు కాగా, అందులో 95 శాతం సాధించినట్టు వివరించారు. ఈ ఏడాది స్టాంప్ డ్యూటీ పెంచడం వల్ల 10 నుంచి 20 శాతం అధికంగా రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా వేశామని చెప్పారు. గత ఏడాది ఆగస్టు నాటికి ఆదాయం లక్ష్యం రూ.115 కోట్లు కాగా, 87 శాతం రూ.103 కోట్లు వచ్చిందని, ఈ ఏడాదిలో ఆ లక్ష్యం రూ.255 కోట్లు కాగా, 77 శాతం రూ.197 కోట్లు లభించినట్టు వివరించారు. గత ఏడాది 40,500 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, ఈ ఏడాది 44 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయని పేర్కొన్నారు. అర్బన్‌లో ఏడాదికి ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకొకసారి స్టాంపు డ్యూటీలు పెంచుతున్నట్టు తెలిపారు.
Advertisement
Advertisement