రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇ–స్టాంపింగ్‌ సేవలను ప్రారంభించిన సీఎం జగన్‌ | CM Jagan Started E Stamping Services In Registration Department | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇ–స్టాంపింగ్‌ సేవలను ప్రారంభించిన సీఎం జగన్‌

Published Fri, Apr 21 2023 2:01 PM | Last Updated on Fri, Apr 21 2023 4:51 PM

CM Jagan Started E Stamping Services In Registration Department - Sakshi

సాక్షి, తాడేపల్లి: రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇ–స్టాంపింగ్‌ సేవలను క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి  డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐటీ సలహాదారు శేషిరెడ్డి, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్‌ కమిషనర్, ఐజీ రామకృష్ణ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్‌ డీఐజీ (గుంటూరు) జి.శ్రీనివాసరావు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రతినిధులు హాజరయ్యారు.

ఇ–స్టాంపింగ్‌ ప్రయోజనాలు

  • ఈ విధానం సురక్షితమైనది, భద్రతగలది మరియు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేనిది
  • www.shcilestamp.com వెబ్‌సైట్‌లో మరియు ఇ–స్టాంపింగ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఇ–స్టాంపులు ఆన్‌లైన్‌లో దృవీకరించుకోవచ్చు
  • నగదు,చెక్కు,ఆన్‌లైన్‌ (నెఫ్ట్, ఆర్టీజీఎస్, పీఓఎస్,యూపీఐ) ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు
  • ఎస్‌బీఐ,ఆప్కాబ్, యూనియన్‌ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచ్‌లు, సీఎస్‌సీ కేంద్రాలు, స్టాంప్‌ అమ్మకందార్లు, స్టాక్‌హోల్డింగ్‌ బ్రాంచ్‌లు కలిపి మొత్తం 1400 కు పైగా కేంద్రాల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది
  • మరొక 1000కి పైగా కేంద్రాల వద్ద త్వరలో ఈసేవలు అందుబాటులోకి రానున్నాయి
  • ఇప్పుడు ఏపీలో క్రయవిక్రయాలు నిర్వహించే పౌరులందరూ 1400 కు పైగా ఎంపిక చేసిన కేంద్రాల వద్ద ఇ–స్టాంపింగ్‌ ద్వారా స్టాంప్‌ పేపర్లు కొనుగోలు చేసి సులభంగా స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ ఛార్జీలను చెల్లించవచ్చు
  • స్టాంప్‌ మరియు రిజిస్ట్రేషన్‌ శాఖ సెంట్రల్‌ రికార్డు నిర్వహించే ఏజెన్సీ అయిన స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా ఏపీ ప్రభుత్వం అందిస్తున్న మరొక ప్రజాహితమైన కార్యక్రమం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement