e-stamping
-
ఏపీ: జిరాక్సులు కాదు.. ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇస్తున్నారు
సాక్షి, అమరావతి/అక్కిరెడ్డిపాలెం (గాజువాక): స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాక ఒరిజినల్ డాక్యుమెంట్లు కాకుండా జిరాక్సు కాపీలు మాత్రమే ఇస్తున్నారనే ప్రచారం పచ్చి అబద్ధమని తేలిపోయింది. రిజిస్ట్రేషన్లు చేయించుకున్న అనేక మంది తమకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇస్తున్నారని చెబుతున్నారు. వారంతా ఒరిజినల్ డాక్యుమెంట్లను కూడా చూపిస్తున్నారు. ఈ–స్టాంపింగ్ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్లకూ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తున్నారని వినియోగదారులు తెలిపారు. పలుచోట్ల నాన్–జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు అందుబాటులో ఉండటంతో అక్కడా రిజిస్ట్రేషన్లు చేసి గతంలో మాదిరిగానే ఒరిజినల్ డాక్యుమెంట్లు జారీ చేస్తున్నారు. ఆస్తి పత్రాలను ప్రభుత్వం వద్దే ఉంచుకుంటారనే ప్రచారం నిజం కాదని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న వారికి స్పష్టంగా తెలుస్తోంది. అనుమానాలు సృష్టిస్తున్న సోషల్ మీడియా ప్రచారం భూముల రిజిస్ట్రేషన్‌పై సోషల్ మీడియా, టీడీపీ ప్రచారం చేస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ విన్న వారు మాత్రం అది నిజమేనని భ్రమపడుతున్నారు. అనుమానం ఉన్నవారు ఎవరైనా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళితే.. అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్ల తీరు, ఇస్తున్న డాక్యుమెంట్లు ఒరిజినల్సా, జిరాక్సులా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరో ముఖ్యాంశం ఏమిటంటే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు, ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి అసలు సంబంధమే లేదనే విషయం కూడా అక్కడికి వెళ్లిని వారికి అవగతమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో కావాలని ప్రజల్లో అపోహలు సృష్టించడం కోసమే జిరాక్సుల ప్రచారం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. భూ హక్కు చట్టంపై వదంతులు నమ్మొద్దు ఆస్తి తాలూకా ఒరిజనల్ డాక్యుమెంట్లను చూపుతున్న ఆర్.కృష్ణగాజువాక ప్రాంతానికి చెందిన ఈయన పేరు ఆర్.కృష్ణ. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎంఎస్సీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇటీవల గాజువాకలోని ఓ ఆస్తిని ఈయన కొనుగోలు చేశారు. గాజువాక జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బుధవారం తన ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలను రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ‘ల్యాండ్ టైట్లింగ్‌పై వస్తున్న వదంతులను, సోషల్ మీడియాలో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని కొందరు వక్రీకరించడంపై అనుమానం వచ్చి సబ్ రిజిస్ట్రార్‌ను వివరణ కోరాను. ఆస్తి హక్కు పత్రాల ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారా, జిరాక్స్ డాక్యుమెంట్లు ఇచ్చారా అని అడిగాను. ఈ వదంతులన్నీ అవాస్తవమని సబ్ రిజిస్ట్రార్ చెప్పారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఆస్తి హక్కుదారునైన నాకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అందజేశారు. సోషల్ మీడియాలో భూ హక్కు చట్టంపై వస్తున్న వదంతులన్నీ అవాస్తవాలే. వీటిని ఎవరూ నమ్మవద్దు’ అని చెప్పారు. ఈ విషయాలపై ఓ వీడియో కూడా విడుదల చేశారు.ఒరిజినల్సే ఇచ్చారు ఉయ్యూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. రిజిస్ట్రేషన్ అయ్యాక ఒరిజనల్ దస్తావేజులు ఇచ్చారు. ఒరిజినల్స్ ఇవ్వడం లేదు, జిరాక్స్ కాపీలు ఇస్తున్నారంటూ కొన్ని టీవీల్లో వస్తున్న వార్తలు నిజం కాదు. – తాతినేని రామ్మోహనరావు, గోపువానిపాలెం, పమిడిముక్కల మండలం, కృష్ణా జిల్లా ఆ ప్రచారం నిజం కాదు నా తల్లితో కలిసి ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. పావు గంటలో రిజ్రస్టేషన్ చేశారు. వెంటనే డాక్యుమెంట్ ఇచ్చారు. రిజిస్ట్రార్ ఆఫీసులో డాక్యుమెంట్ ఇవ్వడం లేదని బయట జరుగుతున్న ప్రచారం నిజం కాదు. మా చేతికి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారు. – ప్రసాద్, చింతలపూడి, ఏలూరు జిల్లాఒరిజినల్ తీసుకున్నాను నేను భీమునిపట్నం రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో స్థలం కొన్నాను. రిజిస్ట్రేషన్ కోసం వెళితే వెంటనే పూర్తి చేశారు. సబ్ రిజిస్ట్రార్‌ను కలిసి కొత్త విధానంలో డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని చెబుతున్నారని అడిగాను. అది అబద్ధమని చెప్పారు. వెంటనే నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారు. – శ్రీకాంత్, భీమిలి, విశాఖ జిల్లా -
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అన్నీ అపోహలే
సాక్షి, అమరావతి: ల్యాండ్టైట్లింగ్ చట్టంపై అవగాహన లేకుండా కొందరు దుర్మార్గ ప్రచారం చేస్తున్నారని ఇండియన్ ఇంటెలెక్చువల్ ఫోరం మండిపడింది. రెవెన్యూ, న్యాయపరమైన అంశాలు తెలియనివారు దీనిపై మాట్లాడుతున్నారని ధ్వజమెత్తింది. ప్రభుత్వం భూములు లాక్కుంటుందనేది శుద్ధ అబద్ధమని తేల్చిచెప్పింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో సోమవారం ఇండియన్ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో సీఎం సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి అజేయ కల్లం, భూచట్టాల నిపుణుడు సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అజేయ కల్లం మాట్లాడుతూ ఈ చట్టంపై హైకోర్టు స్టే ఇచ్చిందని, ఇక ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. భూముల రీ సర్వే పూర్తయ్యాక టైట్లింగ్ మొదలవుతుందని, అప్పుడే డిక్లరేషన్ జరుగుతుందన్నారు. తీసుకువచ్చే మార్పులు చేర్పుల గురించి కోర్టుకు తెలిపాక, అందరితో సంప్రదించాక ఈ చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. టైట్లింగ్ యాక్ట్, రీ సర్వే, ఇ–స్టాంపింగ్ విధానాలు అద్భుతమైన సంస్కరణలని కొనియాడారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే వాటిని ఎలాగైనా అడ్డుకోవాలని దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ల్యాండ్ టైటిల్స్ కోర్టులు ఇవ్వాలి తప్ప రెవెన్యూ శాఖకు ఏం పని అంటున్నారని, దీనిపై నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదన్నారు. ఆర్ఓఆర్ లేక ల్యాండ్ టైట్లింగ్ చట్టం చేసే అధికారం కేవలం కార్వనిర్వాహక వ్యవస్థకే ఉంటుందన్నారు. కోర్టుల్లో కేవలం వివాదాల పరిష్కారానికి, వాటిపై అభిప్రాయాలు చెప్పడానికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. భూ రికార్డుల వ్యవస్థను భ్రష్టు పట్టించినవారే ఇప్పుడు వాటిని పరిష్కరించేందుకు తీసుకువస్తున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 1983 నుంచే భూ రికార్డుల వ్యవస్థ భ్రష్టు పట్టడం మొదలైందన్నారు. ప్రతి సంవత్సరం జమాబందీ, అజమాయిషీ సర్వేలు చేస్తూ కచ్చితమైన రికార్డుల వ్యవస్థగా ఉన్న కరణం వ్యవస్థను ప్రత్యామ్నాయం లేకుండా ఒక్కసారిగా రద్దు చేశారని విమర్శించారు. దీంతో పదేళ్లపాటు క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డులు తయారు చేసేవారు లేకుండాపోయారన్నారు. దీనివల్లే వివాదాలు పెరిగాయని, నకిలీలు, రాజకీయ జోక్యం పెరిగిపోయిందన్నారు. ఆ వ్యవస్థను ప్రక్షాళన చేసి మంచి వ్యవస్థను తీసుకువçస్తుంటే దానిపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.12కి పైగా రాష్ట్రాల్లో ఇ–స్టాంపింగ్ వ్యవస్థ తెల్గీ స్టాంపుల కుంభకోణం తర్వాత కేంద్ర ప్రభుత్వం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని అజేయ కల్లం గుర్తు చేశారు. ఇప్పుడున్న స్టాంప్ పేపర్ల కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లతో ఆ సంస్థ ఇ–స్టాంపింగ్ వ్యవస్థను తెచ్చిందన్నారు. మహారాష్ట్రలో 2015లో ఈ విధానాన్ని తొలిసారి అమలు చేశారని, అది విజయవంతమయ్యాక ఇప్పుడు 12కిపైగా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. 2016లో మన రాష్ట్రంలోనూ తాను రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆ కార్పొరేషన్‌ను ఆహ్వానించి పైలెట్ ప్రాజెక్టు చేయమన్నానని గుర్తు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి ఇ–స్టాంపింగ్ వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు. దాని ట్రయల్స్ కోసం 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 135 డాక్యుమెంట్లు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ మెమో ఇస్తే.. దానికి, ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి లింకు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇ–స్టాంపులు జిరాక్స్ పేపర్లు కావన్నారు. అందులో నాన్–జ్యుడీషియల్ స్టాంపు పేపర్ల కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లు ఉంటాయని తెలిపారు.నల్లచట్టంగా ప్రచారం చేయడం దురదృష్టకరం: భూచట్టాల నిపుణుడు సునీల్కుమార్భూ చట్టాల నిపుణులు, నల్సార్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సునీల్‌కుమార్ మాట్లాడుతూ ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని నల్ల చట్టంగా ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ఈ చట్టం ద్వారా భూములు లాగేసుకుంటారని, కోర్టులకు అధికారాలు ఉండవని, అన్ని అధికారాలు తీసుకెళ్లి టైటిల్ రిజిస్టర్ అధికారికి ఇస్తున్నారని, ఆయన ఎవరికి కావాలంటే వారికి భూములు రాసేస్తారనే ప్రచారాలు పూర్తిగా తప్పని స్పష్టం చేశారు. ఈ చట్టం అమలు జరగకపోతే రాష్ట్రం మళ్లీ 50 ఏళ్లు వెనక్కిపోతుందన్నారు. ఉన్న భూములకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి వారి హక్కులను కాపాడుతుందే తప్ప భూములను లాక్కునే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఉన్న రికార్డుల ఆధారంగా ప్రభుత్వం ఒక రిజిస్టర్ తయారు చేస్తుందని, దాన్ని ప్రజలందరికీ అందుబాటులో పెడతారన్నారు. దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. రీ సర్వే ద్వారా తయారయ్యే రికార్డును టైటిల్ రిజిస్టరింగ్ చట్టం కింద ప్రకటిస్తారని, అది ఆన్లైన్లో అందరికీ అందబాటులో ఉంటుందని వివరించారు. కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదనేది తప్పని, ప్రస్తుతం కోర్టుల్లో నడుస్తున్న కేసులు అలాగే నడుస్తాయన్నారు. అలాగే భూములు అమ్మాలన్నా, దానం చేయాలన్నా టైటిల్ రిజిస్ట్రార్ అనుమతి కావాలనేది అపోహేనని తేల్చిచెప్పారు. కొత్త చట్టం తహశీల్దార్‌కి, సబ్ రిజిస్ట్రార్‌కి ఉన్న అధికారాలను ఒక చోటకు చేరుస్తుందన్నారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్ జరిగి రికార్డులోనూ మార్పు కూడా జరిగిపోతోందన్నారు. భూముల రీ సర్వే పూర్తయితే భూములకు సంబంధించి 80 రకాల సమస్యల్లో చాలావరకు తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కన్వీనర్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో ఈ- స్టాంపింగ్ సేవలు
-
ఇ-స్టాంపింగ్ సేవలను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్
-
రిజిస్ట్రేషన్ సేవలు ఇక సులభతరం
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్లను సులభతరం చేసే ఇ–స్టాంపింగ్ సేవలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సురక్షితంగా రూపొందించిన ఇ–స్టాంపింగ్ విధానం వల్ల ప్రజలకు అనేక ప్రయోజనాలు అందనున్నాయి. www. shcilestamp. com వెబ్సైట్, ఇ–స్టాంపింగ్ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో ఇ–స్టాంపులను పొందవచ్చు. నగదు, చెక్కు, ఆన్లైన్ (నెఫ్ట్, ఆ ర్టీజీఎస్, పీఓఎస్, యూపీఐ) ద్వారా సులభంగా చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ, ఆప్కాబ్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచిలు, సీఎస్సీ కేంద్రాలు, స్టాంప్ అమ్మకందార్లు, స్టాక్ హోల్డింగ్ బ్రాంచ్‌లు కలిపి మొత్తం 1400 పైగా కేంద్రాల వద్ద ఇ–స్టాంపింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో వెయ్యికిపైగా కేంద్రాల వద్ద త్వరలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఆస్తుల క్రయవిక్రయాలు నిర్వహించే పౌరులందరూ 1400 పైగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఇ–స్టాంపింగ్ ద్వారా స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసి సులభంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీలను చెల్లించవచ్చు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సెంట్రల్ రికార్డు నిర్వహించే ఏజెన్సీ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సులభంగా సేవలందించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ విధానంలో వినియోగదారులే స్వయంగా తమ డాక్యుమెంట్లను తయారు చేసుకుని ఇ–స్టాంపింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐటీ సలహాదారు శేషిరెడ్డి, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ రామకృష్ణ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గుంటూరు డీఐజీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ శాఖలో ఇ–స్టాంపింగ్ సేవలను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రిజిస్ట్రేషన్ శాఖలో ఇ–స్టాంపింగ్ సేవలను క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐటీ సలహాదారు శేషిరెడ్డి, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ కమిషనర్, ఐజీ రామకృష్ణ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ డీఐజీ (గుంటూరు) జి.శ్రీనివాసరావు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు హాజరయ్యారు. ఇ–స్టాంపింగ్ ప్రయోజనాలు ఈ విధానం సురక్షితమైనది, భద్రతగలది మరియు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేనిది www.shcilestamp.com వెబ్సైట్లో మరియు ఇ–స్టాంపింగ్ మొబైల్ యాప్ ద్వారా ఇ–స్టాంపులు ఆన్లైన్లో దృవీకరించుకోవచ్చు నగదు,చెక్కు,ఆన్లైన్ (నెఫ్ట్, ఆర్టీజీఎస్, పీఓఎస్,యూపీఐ) ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు ఎస్బీఐ,ఆప్కాబ్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచ్‌లు, సీఎస్సీ కేంద్రాలు, స్టాంప్ అమ్మకందార్లు, స్టాక్‌హోల్డింగ్ బ్రాంచ్‌లు కలిపి మొత్తం 1400 కు పైగా కేంద్రాల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది మరొక 1000కి పైగా కేంద్రాల వద్ద త్వరలో ఈసేవలు అందుబాటులోకి రానున్నాయి ఇప్పుడు ఏపీలో క్రయవిక్రయాలు నిర్వహించే పౌరులందరూ 1400 కు పైగా ఎంపిక చేసిన కేంద్రాల వద్ద ఇ–స్టాంపింగ్ ద్వారా స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసి సులభంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలను చెల్లించవచ్చు స్టాంప్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ సెంట్రల్ రికార్డు నిర్వహించే ఏజెన్సీ అయిన స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఏపీ ప్రభుత్వం అందిస్తున్న మరొక ప్రజాహితమైన కార్యక్రమం -
త్వరలో ఈ–స్టాంప్ డ్యూటీ విధానం
సాక్షి, అమరావతి: ఆస్తుల రిజిస్ట్రేషన్ల సమయంలో ప్రభుత్వానికి కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ, ఇతర చార్జీలను ప్రజలు మరింత సులభంగా ఆన్లైన్లో చెల్లించేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఈ చార్జీలను వినియోగదారులు డాక్యుమెంట్ రైటర్ల సహకారంతో బ్యాంకు చలానాల రూపంలో చెల్లిస్తున్నారు. ఈ విధానాన్ని మరింత సులభతరంగా మార్చేందుకు స్టాంప్ వెండర్లు, గ్రామ–వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లలో ఆన్లైన్లో చార్జీలను కట్టించుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత కొందరు స్టాంప్ వెండర్ల వద్ద ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 71 మంది స్టాంప్ వెండర్లకు అవకాశం ఇచ్చారు. స్టాంప్ డ్యూటీ ఆథరైజ్డ్ కలెక్షన్ సెంటర్ (ఏసీసీ) అనుమతిని వారికి మంజూరు చేశారు. వినియోగదారులు ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం బ్యాంకు చలానాలు కాకుండా స్టాంప్ వెండర్ల వద్ద ఆన్లైన్లో స్టాంప్ డ్యూటీ, ఇతర చార్జీలను కట్టేయవచ్చు. వాటి రశీదులను (స్లిప్‌లు) వారికిస్తారు. వాటిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చూపిస్తే రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేస్తారు. ఎస్‌హెచ్‌సీఐ ద్వారా అమలు ఇందుకోసం రిజిస్ట్రేషన్ల శాఖ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఈ సంస్థతో అనుసంధానమై ఉంటాయి. ఈ సంస్థ స్టాంప్ వెండర్లతో విడిగా ఒప్పందం కుదుర్చుకుని స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ల చార్జీలను కట్టించుకునేందుకు వారికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించనుంది. ఏరోజు కట్టించుకున్న చార్జీల మొత్తాన్ని ఆ రోజే స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ప్రభుత్వానికి జమ చేస్తుంది. దీనివల్ల వినియోగదారులు చలానాలు కట్టేందుకు డాక్యుమెంట్ రైటర్లు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అలాగే నకిలీ చలానాల సమస్య కూడా ఉండదు. త్వరలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో అధికారికంగా స్టాంప్ వెండర్ల వద్ద స్టాంప్ డ్యూటీ కట్టే సౌలభ్యం అందుబాటులోకి రానున్నట్లు రిజిస్ట్రేషన్ శాఖాధికారులు చెబుతున్నారు. మలి దశలో గ్రామ, వార్డు సచివాలయాల్లోనే చెల్లింపులు మలి దశలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. వాస్తవానికి స్టాంప్ వెండర్ల కంటే ముందు వాటిలోనే ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రయత్నించారు. సాంకేతిక అంశాల కారణంగా తర్వాత దశలో గ్రామ, వార్డు సచివాలయాల్లో స్టాంప్ డ్యూటీని కట్టించుకునే సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఆసక్తిగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లకు ఈ అవకాశం ఇవ్వనున్నారు. వినియోగదారులు సులభతరంగా రిజిస్ట్రేషన్ సేవలు పొందడానికి వీలుగా ఈ–స్టాంప్ డ్యూటీ విధానాన్ని తీసుకువస్తున్నట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ చెప్పారు. -
స్టాంప్ వెండర్లకు సర్కారు షాక్!
సాక్షి, విజయవాడ బ్యూరో: రిజిస్ట్రేషన్ల శాఖలో ఈ-స్టాంపింగ్ విధానం ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల దాదాపు 25 వేల మంది స్టాంప్ వెండర్లు ఉపాధి కోల్పోనున్నారు. చాలా ఏళ్లుగా అమల్లో ఉన్న చలానా పద్ధతిలో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రైవేట్ సేవలకు ప్రభుత్వం తెరలేపింది. ముంబైకి చెందిన స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐ)కు ఈ-స్టాంపింగ్ విధానాన్ని అప్పగించేలా ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీన్ని నెల రోజుల్లో అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ-స్టాంపింగ్ విధానం ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో అమల్లో ఉంది. కర్ణాటకలో అనేక అవతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ-స్టాంపింగ్ అమలు కోసం ప్రైవేట్ ఏజెన్సీకి కమీషన్‌గా ఏటా రూ.25 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇకపై స్టాక్ హోల్టింగ్ కంపెనీ ప్రతినిధులు ఉంటారు. లావాదేవీలను ఆన్లైన్ ద్వారా నిర్వహించినందుకు వారికి 0.65 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త విధానం అమలైతే తమ ఉపాధి దెబ్బతింటుందని రాష్ట్రంలో 25 వేల మంది స్టాంప్ వెండర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెండర్ల యూనియన్ ప్రతినిధులు కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి మంత్రి కేఈ కృష్ణమూర్తిని కలిశారు. తమ ఇబ్బందులను తెలియజేశారు. అయితే, ఈ-స్టాంపింగ్‌పై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, మీ ఉపాధి దెబ్బతింటే మేము ఏమీ చేయలేమని వారు చేతులెత్తేయడం గమనార్హం. వద్దన్న విధానమే ముద్దు రిజిస్ట్రేషన్ల శాఖలో కొన్నేళ్లుగా ఈ-స్టాంపింగ్ విధానాన్ని తిరస్కరిస్తూ వచ్చారు. 2003లో టీడీపీ సర్కారు హయాంలో రూ.32 వేల కోట్ల తెల్గీ స్టాంపుల కుంభకోణం వెలుగుచూసింది. రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి అక్రమాలపై సంచలనం రేగింది. ఈ నేపథ్యంలో 2004లో ఈ-స్టాంపింగ్ ప్రతిపాదనను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తిరస్కరించారు. వేలాది మంది స్టాంప్వెండర్ల పొట్టకొట్టే ఈ విధానాన్ని ఆయన అంగీకరించలేదు. ఇవేమీ పట్టని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఈ-స్టాంపింగ్ అమలుపై మంత్రివర్గ ఆమోదం తీసుకుంది.