ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో ఆరుగురు జిల్లా రిజిస్ట్రార్లకు ఎట్టకేలకు పోస్టింగ్‌లు లభించాయి. ఇందులో ముగ్గురిని మార్కెట్ వాల్యూ అండ్ ఆడిట్ డీఆర్‌లు గానూ, మరో ముగ్గురిని సాధారణ జిల్లా రిజిస్ట్రార్లుగానూ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ(రిజిస్ట్రేషన్లు) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వాస్తవానికి ఈ శాఖలో అర్హులైన ఆరుగురు గ్రేడ్–1 సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతులు కల్పిస్తూ డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్స్ కమిటీ (డీపీసీ) గత ఆగస్టులోనే ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు ఖాళీ గా ఉన్నప్పటికీ, గత 5 నెలలుగా ప్రభుత్వం పోస్టింగులను ఇవ్వకపో వడం పట్ల సబ్ రిజిస్ట్రార్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పోస్టింగ్‌లు ఇవ్వడం పట్ల జిల్లా రిజిస్ట్రార్లు, తాజా పోస్టింగ్‌లతో కిందిస్థాయి సిబ్బంది పదోన్నతులకు మార్గం సుగమమైందని పలువురు సబ్ రిజిస్ట్రార్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా రిజిస్ట్రార్లకు పోస్టింగ్‌లు ఇలా..
డీఆర్ పేరు పోస్టింగ్
దినేశ్ దత్తార్ హైదరాబాద్ జిల్లా
కె.వి.రమేశ్‌రెడ్డి సంగారెడ్డి అండ్ మెదక్ జిల్లాలు
వి.రమేశ్ నిజామాబాద్ జిల్లా
ఎం.రవీందర్ రంగారెడ్డి(మార్కెట్‌వాల్యూ అండ్ ఆడిట్)
డి.వి.ప్రసాద్ మేడ్చల్–మల్కాజిగిరి(మార్కెట్ వాల్యూ అండ్ ఆడిట్)
ఎం.ఆర్.ఎన్ .ఆచార్యులు హైదరాబాద్(మార్కెట్ వాల్యూ అండ్ ఆడిట్)