ఇంటి నుంచే రిజిస్ట్రేషన్‌..! | Registration from home ..! | Sakshi
Sakshi News home page

ఇంటి నుంచే రిజిస్ట్రేషన్‌..!

Published Mon, Jul 17 2017 3:30 AM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

ఇంటి నుంచే రిజిస్ట్రేషన్‌..!

ఇంటి నుంచే రిజిస్ట్రేషన్‌..!

స్థిరాస్తి అమ్మకం, కొనుగోళ్లు సులభతరం
- స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సన్నాహాలు
రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్‌ ఫార్మాట్‌
ఆన్‌లైన్‌ ద్వారానే 90 శాతం ప్రక్రియ
తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్ల పూర్తి
 
స్థిరాస్తి అమ్మకం, కొనుగోళ్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఇంటి నుంచే స్లాట్‌ బుకింగ్‌(పలానా రోజు, పలానా సమయం) చేసుకునే వెసులుబాటు కల్పించగా, తాజాగా రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్‌ ఫార్మాట్లను అందుబాటులోకి తెచ్చింది. సేల్‌ డీడ్‌ ఫార్మాట్‌ అందుబాటులో రాగా, మార్ట్‌గేజ్, గిఫ్ట్, లీజ్‌ డాక్యుమెంట్ల ఫార్మెట్లను సైతం వెబ్‌సైట్‌లో పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. వారం రోజుల్లో ఫార్మాట్‌ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది.
– సాక్షి, హైదరాబాద్‌
 
ఆన్‌లైన్‌లోనే 90 శాతం పూర్తి
ప్రజలు ఆన్‌లైన్‌తో అనుసంధానమై ఉంటే చాలు.. ఇంటి నుంచే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ 90 శాతం పూర్తి చేసుకోవచ్చు. ఆస్తుల కొనుగోలు, అమ్మకం దారులు దస్తావేజులను ఇంటి వద్దనే సిద్ధం చేసుకోవచ్చు. స్టాంప్‌ డ్యూటీ ఈ–చలాన్‌ ప్రక్రియ కూడా ఆన్‌లైన్‌ ద్వారా పూర్తి చేసుకుని తమ వెసులుబాటు సమయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు వెళ్లి ఎలాంటి నిరీక్షణ లేకుండా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవచ్చు. ఇకపై స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ కోసం డాక్యుమెంట్‌ రైటర్లు, సబ్‌ రిజిస్ట్రార్, సిబ్బంది దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
 
ఆటోమెటిక్‌గా డాక్యుమెంట్‌..
రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌తో అనుసంధానమై స్థిరాస్తి వివరాలు నమోదు చేస్తే చాలు డాక్యుమెంట్‌ ఆటోమెటిక్‌గా జనరేట్‌ అవుతోంది. వెబ్‌సైట్‌లోని ఈ–సర్వీస్‌లోకి వెళ్లి ‘ఫ్రీ రిజిస్ట్రేషన్‌’పై క్లిక్‌ చేస్తే.. పబ్లిక్‌ డేటా ఎంట్రీ సైట్‌ ఓపెన్‌ అవుతుది. అందులో న్యూ ఎంట్రీని క్లిక్‌ చేస్తే డాక్యుమెంట్‌ స్వరూపం ఆప్షన్‌ వస్తుంది. అందులో సేల్‌డీడ్, మార్ట్‌గేజ్, గిఫ్ట్, లీజ్‌లో ఒకదానిపై క్లిక్‌ చేస్తే.. తర్వాత ఆప్షన్‌లో అడిగిన విధంగా వరుసగా అమ్మకం, కొనుగోలుదారుల వివరాలు, స్థిరాస్తి వివరాలు, హద్దులు, విలువ నమోదు చేసుకుంటూ వెళ్తే.. చివరకు స్టాంప్‌ డ్యూటీ, ఈ–చలాన్‌తోపాటు పూర్తిస్థాయి డాక్యుమెంట్‌ జనరేట్‌ అవుతుంది. దానిని డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత.. అదనపు సమాచారం ఉంటే నమోదు చేసుకుని స్టాంప్‌ పేపర్‌పై ప్రింట్‌ చేసుకోవచ్చు. దీంతో రిజిస్ట్రేషన్‌ శాఖ ఫార్మాట్‌లో స్థిరాస్తి దస్తావేజు రూపకల్పన ప్రక్రియ పూర్తవుతుంది.
 
చెక్‌ స్లిప్‌ కూడా..
ఈ–సర్వీసుల్లోని పబ్లిక్‌ డేటా ఎంట్రీ ద్వారా స్థిరాస్తి పూర్తి వివరాలు నమోదు చేసి ఇంట్లోనే ‘చెక్‌ స్లిప్‌’తయారు చేసుకోచ్చు. వాస్తవంగా ఆస్తుల కొనుగోలు, అమ్మకందారులు సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది తమ కంప్యూటర్‌లో కొనుగోలు, అమ్మకందారుల పేర్లు, చిరునామా, ఆస్తి వివరాలు, విలువ వంటివి పొందుపర్చడాన్ని చెక్‌ స్లిప్‌గా వ్యవహరిస్తారు. ఇవన్నీ నమోదు చేసి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం బాగా పడుతోంది. చెక్‌ స్లిప్‌ ఇంటి నుంచే నమోదు చేసుకుంటే తప్పులు కూడా దొర్లే ఆస్కారం ఉండదు. తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement