హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పలువురికి పదోన్నతులు లభించాయి. కొందరు జిల్లా రిజిస్ట్రార్లకు డిప్యూటీ ఇన్‌స్పెక్టరు జనరల్ (డీఐజీ)గాను, జాయింట్ సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగాను నోషనల్ ప్రమోషన్ కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా రిజిస్ట్రారుగా పనిచేస్తున్న లక్ష్మీకుమారికి ప్రభుత్వం డీఐజీగా నోషనల్ ప్రమోషన్ కల్పించింది.
అయితే ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు. పోస్టింగ్ కోసం ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పలువురు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా నోషనల్ ప్రమోషన్ కల్పించింది. పదోన్నతులు, పోస్టింగులకు సంబంధించి పూర్తి సమాచారం పెట్టకుండా వెబ్‌సైట్‌లో జీవో నంబర్లు మాత్రమే అధికారులు అప్ డేట్ చేయడం గమనార్హం.