సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల నిర్మాణ పనులకు డిజైన్ల గండం పట్టుకుంది. ఇప్పటికే టెండర్లు పూర్తయినా, పలు చోట్ల భవనాల నిర్మాణం ప్రారంభమైనా.. డిజైన్లు మార్చాలంటూ రిజిస్ట్రేషన్ల శాఖే పనులు నిలిపివేసింది. డిజైన్లు మార్చినా ఆమోదించకుండా కాలయాపన చేస్తోంది. ఇప్పుడు మళ్లీ మరిన్ని మార్పులంటూ జాప్యం చేస్తోంది. అయితే ఈ ‘డిజైన్ల’ తంతు వెనుక తమ వారికే పనులు అప్పగించాలన్న ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు రిజిస్ట్రేషన్ కార్యాలయ భవనాల నిర్మాణ బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎంఐడీసీ) ఈ తీరుతో విసుగెత్తిపోయింది. పనులను చేయలేమంటూ చేతులెత్తేసింది. క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను సాగనివ్వనందున తమ ద్వారా టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారని, వెంటనే తిరిగి చెల్లించాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసింది.
అసలేం జరిగింది..?
రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సుమారు రూ.120కోట్లతో సొంత భవనాలను నిర్మించాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. వీటి నిర్మాణ బాధ్యతలను టీఎస్‌ఎంఐడీసీకి అప్పగించారు. తొలిదశలో ఇప్పటికే 7 భవనాల పనులు పూర్తికాగా, 10 భవనాల నిర్మాణం కొనసాగుతోంది. మరో ఐదు భవనాలకు స్థలం కేటాయింపు జరగక పనులు పెండింగ్‌లో పెట్టారు. రెండో దశలోని 39 భవనాలకు, మూడో దశలోని 26 భవనాల కోసం రూ.44.63కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి.
తేలని డిజైన్ల లొల్లి!
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనాల ‘పైకప్పు వాలుగా ఉండే’ డిజైన్లను గతేడాది సెప్టెంబర్‌లోనే ప్రభుత్వం ఆమోదించగా... ఆ మేర కు టీఎస్‌ఎంఐడీసీ నిర్మాణ పనులను ప్రారంభించింది. అయితే పైకప్పు సమానంగా ఉండేలా డిజైన్లను మార్చాలని ఇటీవల రిజిస్ట్రేషన్ల శాఖ మెలికపెట్టింది. దీంతో పైకప్పు వాలు డిజైన్‌కు బదులుగా చదరం (ఫ్లాట్) డిజైన్లను రూపొందించిన టీఎస్‌ఎంఐడీసీ వాటిని గత మార్చి 5న రిజి స్ట్రేషన్ల శాఖకు సమర్పించింది. దాదాపు రెండున్నర నెలల పాటు వాటిని పక్కన పెట్టి న రిజిస్ట్రేషన్ల శాఖ... వాటికి మరిన్ని మార్పులు చేయాలని తాజాగా సూచించింది. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో పనులు చేసే వాతావరణం లేదని, తాము చెల్లించిన డిపాజిట్‌లను వెనక్కి ఇచ్చేయాలని కోరుతున్నారు.
‘రిజిస్ట్రేషన్’ భవ నాలకు‘డిజైన్ల’ గండం
Published Mon, May 30 2016 3:54 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement
Advertisement