- స్పెషల్ సీఎస్ నుంచి డిప్యూటీ సీఎంకు ఫైలు
- నేడు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో ఖాళీగా ఉన్న జిల్లా రిజిస్ట్రార్(డీఆర్) పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులు ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలును ఉన్నతాధికారులు శుక్రవారం ఎట్టకేలకు కదిలించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంతకం చేయడంతో ఫైలు అక్కడ్నుంచి ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ఉప ముఖ్యమంత్రి పరిశీలన అనంతరం శనివారం ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, పోస్టింగ్‌ల కోసం వేచిచూస్తున్న జిల్లా రిజిస్ట్రార్లలో కొందరు తమకు నచ్చిన చోట పోస్టింగ్‌ల కోసం పైరవీలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రధానంగా ఇప్పటివరకు సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన కార్యాలయం పరిధిలోనే ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్‌గా పోస్టింగ్‌లు దక్కించుకోవాలని ఒకరిద్దరు తీవ్రంగా యత్నిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 23 డీఆర్ పోస్టులుండగా అందులో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్, హైదరాబాద్ సౌత్, రంగారెడ్డి, రంగారెడ్డి ఈస్ట్, మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు ఖాళీగా ఉండగా, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలకు రెగ్యులర్ డీఆర్‌ల స్థానంలోనూ ఇన్‌చార్జిలే కొనసాగుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన కార్యాలయంలోనూ జిల్లా రిజిస్ట్రార్ హోదా కలిగిన అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పోస్టులను ప్రభుత్వం రెండేళ్లుగా భర్తీ చేయలేదు.
త్వరలో జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల భర్తీ!
Published Sat, Oct 29 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
Advertisement
Advertisement