సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రమేర్పడి రెండేళ్లయినా రిజిస్ట్రేషన్ల శాఖలో ఉద్యోగులకు, అధికారులకు పదోన్నతుల విషయమై ఇంకా అన్యాయమే జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర సబ్ రిజిస్ట్రార్ల సంఘం ఆరోపించింది. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 1,2 పోస్టుల్లో పదోన్నతి కోసం ఏటా ప్యానెల్స్‌ను రిజిస్ట్రేషన్ల శాఖ విడుదల చేయాల్సి ఉండగా, అడిగితే తప్ప ఉన్నతాధికారులు ఏటా కనికరించడం లేదని సంఘం అధ్యక్షుడు విజయ్‌భాస్కర్‌రావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2015-16 ప్యానెల్ గురించి చేసిన ప్రయత్నాలు ఫలించే సమయంలో విభాగాధిపతి సెలవుపై వెళ్లడంతో ఆశలు అడియాసలయ్యా యన్నారు.
ఆగష్టు 31లోగా ప్యానెల్‌ను విడుదల చేయకుంటే, సెప్టెంబర్ 1నుంచి కొత్త ప్యానెల్ ఇయర్ ప్రారంభమై కొత్త జాబితా, పరిశీలన చేయాల్సి వస్తుందన్నారు. రెండేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేక ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నా రు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వెంటనే చార్జిమెమోలు ఇస్తారని, ప్యానెల్ విడుదలలో నిర్లక్ష్యానికి ఎవరిపై చర్యలు తీసుకుంటారో ఉన్నతాధికారులు చెప్పాలన్నారు.
తెలంగాణ వచ్చినా అన్యాయమే: సబ్ రిజిస్ట్రార్ల సంఘం
Published Tue, Aug 30 2016 1:46 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
Advertisement