రిజిస్ట్రేషన్ల శాఖకు ఆధునిక సాంకేతికత
- కొత్త ఫెసిలిటీ మేనేజర్ నియామకానికి సన్నాహాలు
- విప్రో, టీసీఎస్, హెచ్‌పీ సంస్థలతో అధికారుల సంప్రదింపులు
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్లు, సాంపుల శాఖ సరికొత్త హంగులను సంతరించుకోబోతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాత కంప్యూటర్ వ్యవస్థకు బదులుగా ఆధునిక సాంకేతికత కలిగిన సిస్టమ్‌లు, ఇతర సామగ్రిన త్వరలోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రాబోతున్నారుు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్, 12 జిల్లా రిజిస్ట్రార్, 12 ఆడిట్ రిజిస్ట్రార్, 14 చిట్ రిజిస్ట్రార్, 9 డీఐజీ కార్యాలయాలతో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన కార్యాలయంలోనూ కంప్యూటర్ వ్యవస్థలను సమూలంగా మార్చాలని, ఈ మేరకు కొత్త ఫెసిలిటేటర్‌ను నియమించాలని ఉన్నతాధికారులు నిర్ణరుుంచారు. ఐదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖకు ఫెసిలిటీ మేనేజర్‌గా ప్రభుత్వం నియమించిన టీసీఎస్ సంస్థకు కాంట్రాక్ట్ గడువు గత ఆగస్టుతోనే ముగిసింది. దీంతో టీసీఎస్ తమ సిబ్బందిని, సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను వెనక్కి తీసుకోవడంతో రెండు, మూడు నెలలుగా క్షేత్ర స్థారుులో సాంకేతిక సమస్యలు వెల్లువెత్తారుు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతుండడం, వినియోగదారుల నుంచి పెద్దెత్తున ఫిర్యాదులు రావడంతో కొత్త ఫెసిలిటీ మేనేజర్ నియామకంపై సర్కారు దృష్టి సారించింది.
కొత్త ఎఫ్‌ఎంతో ఆధునిక టెక్నాలజీ
శాఖ సాంకేతిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధునాతన సాంకేతికత కలిగిన కొత్తఫెసిలిటీ మేనేజర్ ఎంపికకు అధికారులు కసరత్తు ప్రారం భించారు. ఇప్పటికే విప్రో, టీసీఎస్, హెచ్‌పీ వంటి సంస్థలతో సంప్రదింపులు పూర్తరుునట్లు తెలిసింది. ఐదేళ్ల వరకు నిర్వహణ బాధ్యతలను కొత్త ఎఫ్‌ఎంకు అప్పగించేందుకు టెండర్ ప్రక్రియకు పోవాలని అధికారులు నిర్ణరుుంచారు. నెలాఖరు లోగా టెండర్ ప్రక్రియను పూర్తిచేసి వచ్చే డిసెంబరు లేదా జనవరి నుంచి కొత్త ఎఫ్‌ఎం సేవలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నా రు. దీంతో పాటు ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రాలకు స్టేట్ డేటా సెంటర్లో సేవలందిస్తున్న సర్వర్ స్థానం లో తెలంగాణకు ప్రత్యేక సర్వర్‌ను ఏర్పాటు చేసు కోవాలని కూడా యోచిస్తున్నారు. ఈ నేపథ్యలో వచ్చే ఐదేళ్ల కాలానికి సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు వ్యయమతుందని శాఖ అంచనాలను సిద్ధం చేసింది.