
రిజిస్ట్రేషన్లపై నిఘానేత్రం!
- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
- ఏప్రిల్ 1 నుంచి అమలుకు రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో మరింత పారదర్శకత కోసం రిజిస్ట్రేషన్లు–స్టాంపుల శాఖ మరో కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. క్షేత్రస్థాయిలో జరిగే అన్ని రకాల రిజిస్ట్రేషన్లను ‘రికార్డ్ ఆఫ్ రిజిస్ట్రేషన్’ పేరిట సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇటువంటి విధానాన్ని అవలంబిస్తున్న మహా రాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలపై రాష్ట్ర రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఉన్నతాధి కారులు ఇటీవల అధ్యయనం కూడా చేశారు. రాష్ట్రంలోనూ అటువంటి విధానాన్ని అవలం బించడం ద్వారా కొంతమేరకైనా అవకతవక లకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. దీనిపై దాదాపు నెలరోజులుగా ఉన్నతాధికారులు చేస్తున్న కసరత్తు.. తాజాగా ఓ కొలిక్కి వచ్చి నట్లు తెలుస్తోంది.
అక్రమాలకు అడ్డుకట్ట
ప్రధానంగా రిజిస్ట్రేషన్ల సమయంలో ఆస్తుల విక్రయదారులకు బదులు ఇతరులు హాజరు కావడం, రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ చేసినది తాను కాదని విక్రేతలు చెబుతుం డడం, బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకు న్నారంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్ర యించడం.. వంటి సమస్యలకు, అక్రమాలకు కొత్త విధానంతో చెక్ పెట్టవచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అంతే గాకుండా అవినీతిని నియంత్రించేం దుకు కూడా సీసీ కెమెరాల ఏర్పాటు ఉపకరిస్తుందని అవినీతి నిరోధక శాఖ పలు ప్రభుత్వ శాఖ లకు సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు అన్ని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతి పాదనలు సిద్ధం చేసింది. రిజిస్ట్రేషన్ల శాఖకు సాంకేతిక సేవలందించే ఫెసిలిటీ మేనేజర్ నియామక టెండర్‌లోనూ సీసీ కెమెరాల ప్రతిపాదనను పొందుపరిచినట్లు సమా చారం. రిజిస్ట్రేషన్ల శాఖ రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే ఏప్రిల్ 1నుంచి అమల్లోకి తేవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు
రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన కార్యాల యంలో మాదిరిగా క్షేత్రస్థాయిలోని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగులకు బయో మెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని ఉన్న తాధికారులు నిర్ణయిం చారు. కొందరు ఉద్యోగులు కార్యాల యానికి రాకుండానే తాత్కాలిక ఉద్యోగు లతో పనులు చేయిస్తు న్నారని, సబ్ రిజిస్ట్రార్లు సైతం సమయానికి విధులకు హాజరుకావడం లేదన్న ఫిర్యా దుల నేపథ్యంలో బయోమెట్రిక్ వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. కార్యాలయంలో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్‌కు సబ్ రిజిస్ట్రార్ బయోమెట్రిక్ ద్వారానే ఆమోదం తెలిపే విధంగా నూతన వ్యవస్థ ఉండాలని అధికారులు భావిస్తున్నారు. మొదట ఇచ్చిన డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్ చేయ కుండా తరువాత వచ్చిన డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుకాదని చెబుతు న్నారు. అంటే ‘తొలుత వచ్చిన వారికి తొలుత (ఫస్ట్ కమ్ ఫస్ట్)’ ప్రాతిపదికన రిజి స్ట్రేషన్లు జరిగేందుకు వీలవుతుం దంటున్నారు.