ఆ చిన్నారులను అక్కున చేర్చుకుంటాం
దత్తతకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలు
నవాబుపేట: ఆ ఇద్దరు అనాథ పిల్లలను అక్కున చేర్చుకుంటామని పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. సార్.. మమ్మల్ని చదివించండి’ అంటూ మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం గురుకుంట గ్రామానికి చెందిన నందిని, శృతి గురువారం నిర్వహించిన రెవెన్యూ దర్బార్‌లో తహసీల్దార్ చెన్నకిష్టప్పకు మొరపెట్టుకున్నారు. దీనిపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి హైదరాబాద్‌కు చెందిన సర్వ్‌నీడి, మెటాస్కాన్ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి.
ఈ విషయంలో తహసీల్దార్‌తో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించి అందరి అనుమతితో దత్తత తీసుకుని చదివిస్తామని వెల్లడించాయి. కాగా, గురుకుంటకు చెందిన నందిని, శృతిల మేనత్త, గ్రామస్తులతో చర్చించి వారి దత్తత విషయం ప్రకటిస్తామని, చిన్నారులదే తుది నిర్ణయమని తహసీల్దార్ చెన్నకిష్టప్ప వివరించారు.