ఆర్టీసీ దైన్యం (2013 రౌండప్) | RTC Dine (2013 Roundup) | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ దైన్యం (2013 రౌండప్)

Published Fri, Dec 27 2013 1:21 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

ఆర్టీసీ దైన్యం (2013 రౌండప్) - Sakshi

ఆర్టీసీ దైన్యం (2013 రౌండప్)

కాలగర్భంలో మరో వత్సరం కరిగి  పోనుంది. గడిచిపోతున్న ఈ ఏడాది కొన్ని ఆనంద క్షణాలనే మిగిల్చినా.. సంవత్సరం మొత్తాన్ని పరికించి చూస్తే చేదు జ్ఞాపకాలే ఎక్కువగా కళ్ల ముందు మెదులుతారుు. ఇందులో ప్రధానంగా రాష్ట్ర విభజన నిర్ణయమే కంటనీరు తెప్పిస్తుంది. మన కలల పసిడి మేడను నిలువునా కూల్చేస్తూ యుపీఏ ప్రభుత్వం ఎంత తొందరగా నిర్ణయం తీసుకుందో.. అంతే తొందరగా జిల్లాలో సమైక్య ఉద్యమం బలపడింది. జిల్లా పౌరుషం..  చైతన్యం.. దేశభక్తి.. ఉద్యమ స్ఫూర్తి.. వెరసి తెలుగు జాతి ఉత్తేజితమైంది. బస్సు చక్రాలు తిరగలేదు. ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయలేదు. బడులు తెరుచుకోలేదు. హోటళ్లు, షాపింగ్ మాల్స్, వాణిజ్య సంస్థలు మూతపడ్డారుు. ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు రోడ్డెక్కి సమైక్య వాణి వినిపించారు. ఆర్టీసీ కార్మికులంతా ఉద్యమ బావుటా ఎగురవేయడంతో ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బ  తగిలింది. ఈ నేపథ్యంలో 2013 సంవత్సరంలో మన జిల్లాలో ఉద్యమ నేపథ్యం, ఆర్టీసీ నష్టాల పయనాన్ని ఒకసారి పరికిస్తే..  
 
విజయవాడ డిపో లాభం హుష్‌కాకి
 
ఆర్టీసీ కృష్ణా రీజియన్ గత ఏడాది కాలంలో కనివినీ ఎరుగని రీతిలో నష్టాలు చవిచూసింది. గతంలో వచ్చిన నష్టాల శాతాన్ని తగ్గించుకుని లాభాలవైపు దూసుకుపోవాలనే ఉద్దేశంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఆర్టీసీకి సమైక్య సెగ కోలుకోలేని దెబ్బతీసింది. ఆర్టీసీ సిబ్బంది అంతా ఒకేసారి సమ్మె చేసిన దాఖాలలు అరుదు. సమైక్యాంధ్ర ఉద్యమానికి అన్ని యూనియన్లు భాగస్వామ్యం తీసుకోవడంతో జిల్లాలో సుమారు 60 రోజులు ఒక్క బస్సు కూడా రోడ్డుపైకి రాలేదు. ఆగస్టు 13 నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు ఆర్టీసీ కార్మికులంతా సమైక్యాంధ్ర ఉద్యమంలోనే పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా రీజియన్‌లో సంస్థకు రోజుకు కోటి30 లక్షల రూపాయల చొప్పున 78 కోట్ల ఆదాయం రాలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం లేని ఏప్రిల్-జులైలో రూ.3కోట్ల80 లక్షల లాభం వచ్చింది.


 ఏటా కృష్ణా రీజియన్‌కు వన్నె తీసుకొచ్చే విజయవాడ డిపో నష్టాలతో సహవాసం చేస్తోంది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈసారి మే, జూన్‌లో మన రీజియన్ రాష్ర్టవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. జూన్ నుంచి పరిశీలించి చూస్తే అత్యున్నతస్థాయిలో ఉన్న డిపో ఆదాయం అమాంతంగా పడిపోయింది. సమైక్యాంధ్ర సెగతో ఆదాయం తగ్గి డిపో నష్టాల్లో లేకపోయినా లాభాల ఆర్జన తగ్గింది. గత యేడాది జూన్‌లో రూ.కోటి 59లక్షలు, జులైలో రూ.రెండుకోట్లు లాభం రాగా, 2013 జూన్‌లో రూ.36 లక్షలు, జులైలో రూ.కోటి 62లక్షలు మాత్రమే ఆదాయం వచ్చింది. గత ఏడాది నవంబర్‌లో రూ.61లక్షల లాభం రాగా, ఈసారి రూ.4.76లక్షలు మాత్రమే వచ్చింది.
 
150 కొత్త బస్సులు వచ్చాయ్..
 
ఈ ఏడాది కృష్ణా రీజియన్‌కు సుమారు 150 బస్సులు కొత్తగా వచ్చాయి. గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమైన జగదల్‌పూర్ సర్వీసులను ఈ ఏడాది మార్పులు చేర్పులు చేసి ప్రయూణికులకు సౌకర్యవంతంగా నడిపారు. ఫిబ్రవరి నుంచి విజయవాడ-చెన్నైకు వెన్నెల సర్వీసులు నడపడం ప్రారంభించారు. విజయవాడ-శ్రీకాకుళం మధ్య కూడా నడిపేందుకు ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు.  జూన్‌లో నగరంలోని వైఎస్సార్ కాలనీ, ఐదో నంబర్ రూట్, ఆటోనగర్, వాంబేకాలనీ తదితర ప్రాంతాలను కలుపుతూ పలు సర్వీసులు ఏర్పాటుచేశారు. అదే నెలలో మహిళలకు ప్రత్యేక సర్వీసులు సిద్ధం చేశారు.
 
అధికారుల రాకపోక

 ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సూర్యప్రకాశ్‌రావు మే 31వ తేదీ పదవీ విరమణ చేయగా, ఆయన స్థానంలో నాగేశ్వరరావు వ చ్చారు. ఆర్టీసీ కృష్ణా రీజియన్ మేనేజర్‌గా ప్రమోషన్‌పై వచ్చిన గోపీనాథ్‌రెడ్డి మే 31న బదిలీ కాగా, ఆయన స్థానంలో సుదేష్‌కుమార్ వచ్చారు. జూన్‌లో ఆర్టీసీ రీజియన్‌లో గ్రీవెన్స్ సెల్‌ను రద్దుచేసి కాల్‌సెంటర్ (8019999999)ను ఏర్పాటు చేశారు.
 
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కానున్నదా!?
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌గా గుర్తింపుపొందిన ఏపీఎస్‌ఆర్టీసీ రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో వీలినం కానున్నది. దీనికి 2013 ఏడాదే అంకురార్పణ జరిగింది.
 
 జిల్లాపై రోజుకు రూ.10లక్షల భారం

 ఈ ఏడాది ఆర్టీసీ ప్రయాణికుల నడ్డి విరిచిందనే చెప్పాలి. సమైక్యాంధ్ర సమ్మె ఉద్యమంతో కోట్ల రూపాయలు నష్టపోయిన ఆర్టీసీని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పుకుని నవంబరు 4వ తేదీన ప్రజలపై చార్జీల మోత మోగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లావాసులపై రోజుకు రూ.10లక్షల భారం పడింది. అన్ని టికెట్ రేట్లతో పాటు విద్యార్థుల బస్‌పాస్‌ల రేట్లు కూడా పెంచారు. సిటీ సర్వీసుల్లో మినహా రూరల్, ఇతరత్రా ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో జూలై ఒకటి నుంచి సెస్ చార్జీల పేరిట రూపాయిని అదనంగా వసూల్ చేయడం మొదలు పెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement