రెయిన్‌గన్‌ల వాడకంలో విద్యార్థుల సాయం
కర్నూలు(అగ్రిల్చర్): రెయిన్‌గన్‌ల వాడకంలో ప్రభుత్వం విద్యార్థుల సాయం తీసుకుంటోంది. బుధవారం మూడు ప్రత్యేక బస్సుల్లో రాయలసీమ యూనివర్సిటీ, ఉస్మానియా కళాశాల, బి.క్యాంపు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు 150 మంది ఆలూరు, ఆస్పరి, పత్తికొండ మండలాలకు తరలివెళ్లారు. ముందుగా కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో వీరికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌యూ వైస్ చాన్స్‌లర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల రెయిన్‌గన్‌లపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి రెయిన్‌గన్‌లతో పంటలు తడుపుకోవడంలో రైతులకు సహకరించాలన్నారు. రాయలసీమ వర్సిటీ రిజిష్ట్రార్ అమర్‌నాథ్, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, సీపీఓ ఆనంద్‌నాయక్, ప్రణాళిక శాఖ సహాయ సంచాలకులు రమణప్ప తదితరులు పాల్గొన్నారు.