జగన్ నాయకత్వం అవసరం | On the need for leadership | Sakshi
Sakshi News home page

జగన్ నాయకత్వం అవసరం

Published Thu, Mar 6 2014 2:24 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

On the need for leadership

  •    మిథున్,చెవిరెడ్డి నాకురెండు కళ్లు -పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  •      నిజారుుతీకి మారుపేరు చెవిరెడ్డి - నారాయణస్వామి
  •      ఆదరించండి .. అభివృద్ధి చేసి చూపిస్తా - చెవిరెడ్డి
  •      బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చిన జనం
  •  చంద్రగిరి, ఎర్రావారిపాళెం, న్యూస్‌లైన్: ‘తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలను చంద్రబాబు భయబ్రాంతులకు గురిచేశాడు..మూడేళ్ల కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన అడుగడుగునా చంద్రబాబును గుర్తుచేసింది. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది’ అని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనను గుర్తు చేసుకుని ఇప్పటికీ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు.

    రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులను బాబు ముప్పుతిప్పలు  పెట్టించారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని గెలిపించి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలంలో బుధవారం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తనకు మిథున్ ఎలాగో చెవిరెడ్డి భాస్కరరెడ్డి అంతేనని అన్నారు. వారిద్దరూ రెండు కళ్లులాంటివారన్నారు.

    చెవిరెడ్డి నిజాయతీకి మారుపేరని, ఎన్నికల్లో చెవిరెడ్డిని ఆదరించాలని కోరారు. చెవిరెడ్డి ఎమ్మెల్యే అరుుతే పార్టీలకతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు.  ఈ మండలంలో తాను నిర్మించిన రెండు ప్రాజెక్టుల వల్లే నీటి సమస్య పరిష్కారం అయిందన్నారు. అయితే ప్రాజెక్టుల నిర్మాణాల్లో నష్టపోయిన వారికి ఇంతవరకూ పరిహారం చెల్లించక పోవడం దారుణమన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన వెంటనే బాధితులకు నష్టపరిహారం చె ల్లిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి మాట్లాడుతూ గల్లా అరుణకుమారిలా  చెవిరెడ్డి భాస్కరరెడ్డి  పైరవీలు, మాయమాటలు చెప్పి రాజకీయం చేసేవ్యక్తి కాదన్నారు.

    కష్టపడే తత్త్వం, నమ్మిన వారికి అండగా నిలవడం, అభివృద్ధి చేయాలనే సంకల్పం భాస్కర్‌రెడ్డి నైజమని తెలిపారు.  గాలి ముద్దకృష్టమనాయుడు, చెంగారెడ్డి పేదల శవాలవద్ద ఫొటోలకు ఫోజులిచ్చి పేపర్లో వేయించుకుని నీచ రాజకీయాలు చేసే వారని ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్‌రాజశేఖరరెడ్డి  ఏనాడూ కులమాతాల ప్రస్తావన తీసుకురాలేదన్నారు.  ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబునాయుడు ఆల్‌ఫ్రీ మాటలను నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు.
     
    దెబ్బలు, బూట్ల తన్నులే మిగిలాయి
     
    టీడీపీ పాలనలో ప్రజలకు లాఠీ దెబ్బలు, బూట్ల తన్నులే మిగిలాయని వైఎస్సార్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డి ధ్వజమెత్తారు.  వైఎస్‌రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు రాష్ట్రంలో చంద్రబాబు భయానక పాలన సాగిందన్నారు. బాబు పాలనలో వృద్ధులకు, వితంతువులకు  రూ. 70 పింఛన్ ఇచ్చేవారన్నారు. అదనంగా   ఇవ్వాలంటే పింఛన్ తీసుకుంటున్న వారిలో ఎవరోఒకరు చనిపోవాలన్నారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ నాడు ఉండే దన్నారు. ఎన్నికల ముందు కిలో బియ్యం రూ. 2 కే ఇస్తానని హామీ  ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5 కు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని  విమర్శించారు. తొమ్మిదేళ్ల బాబు పాలనలో ప్రజలు నరకం చూశారని అన్నారు. ఎవరూ చేయని విధంగా రాజశేఖరరెడ్డి ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఆయన రుణం తీర్చుకోవాలంటే జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంని చేయాలన్నారు.

    వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే  డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామన్నారు. అమ్మఒడి పేరుతో బిడ్డను బడికి పంపించే  తల్లి బ్యాంకు ఖాతాలో నెలకు రూ. 500 జమ అవుతుందని తెలిపారు.  ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని  ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రెండు ముక్కలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు సహకరించిన మన జిల్లాకు చెందిన కిరణ్, చంద్రబాబు సీమాంధ్ర ద్రోహులని మండిపడ్డారు. చంద్రగిరి నియోజకవర్గానికి  గల్లా అరుణకుమారి  చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. రాన్నున ఎన్నికల్లో తనను ఆదరిస్తే ఎల్లవేళలా  అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధిని చేసి చూపిస్తానని తెలిపారు.
     
    వైఎస్సార్ సీపీలో 500 మంది చేరిక

     వైఎస్సార్ సీపీ సేవాదళ్ కన్వీనర్ మహ్మద్‌అలీ, కార్యదర్శి వెంకటసిద్ధులు, నాయకులు దేవపట్ల నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి  సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 500 మంది వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేశ్వర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, రమేష్, మండల కన్వీనర్ వెంకట్రామిరెడ్డి, సర్పంచ్‌లు చెంగల్‌రెడ్డి, నడిపి రెడ్డెప్పరెడ్డి, మండల మహిళా కన్వీనర్ సుమ తి, మాజీ వీఆర్వో కృష్ణయ్య, శ్రీనివాసులు, శ్రీరాములు, ప్రభాకర్‌రెడ్డి, సహదేవరెడ్డి, రాజమణినాయక్, రమణ, వెంకటేష్, రెడ్డిమోహన్ పాల్గొన్నారు.
     
     బాబు తన సామాజిక వర్గం కోసమే ఓడించారు

     చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గెలుపుకోసం సొంత పార్టీ అభ్యర్థులను ఓడించిన నీచసంస్కృతి కలిగిన వ్యక్తని వైఎస్సాసీపీ కేంద్రకార్యనిర్వాహక మండలి సభ్యురాలు రోజా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు కులపిచ్చి ఎక్కువ అని, ఆ సామాజిక వర్గం అభ్యర్థులు  విజయం కోసం సొంతపార్టీ అభ్యర్థులనే ఓడించేందుకు ఆయన వెనుకాడరని ధ్వజమెత్తారు. 1999 నుంచి 2009 వరకు టీడీపీ అభ్యున్నతి కోసం కూలీలా పనిచేశానన్నారు.  2009లో చంద్రగిరి అభ్యర్థిగా అవకాశం ఇచ్చనట్టేచ్చి తన సామాజిక వర్గానికి చెందిన అరుణకుమారి గెలుపుకోసం టీడీపీ నేతలు పరోక్షంగా కృషి చేశారన్నారు. కులపిచ్చి వదలి కనువిప్పు కలగాలంటే అన్ని వర్గాలవారు ఏకమై ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement