The unemployed
-
సార్లొస్తారు
త్వరలో డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్..! ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు కుమ్రంభీం జిల్లాలోనే అత్యధిక ఖాళీలు.. నిర్మల్ జిల్లాలో స్వల్పం మంచిర్యాల సిటీ : ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులకు మోక్షం లభించనుందా..? ప్రభుత్వం టెట్, డీఎస్సీ నిర్వహించడం ద్వారా ఐదేళ్ల తరువాత నిరుద్యోగుల ఆశలు తీర్చనుందా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెపుతున్నాయి అధికార వర్గాలు. జిల్లాల వారీగా ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), డీఎస్సీని వేర్వేరుగానే నిర్వహించి నియామకాలు చేపట్టనున్నట్లు ఇటీవల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ముందుగా టెట్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాతనే డీఎస్సీ ప్రకటన రానున్నట్లు – మిగతా 2లోu సమాచారం. అన్నీ సక్రమంగా కుదిరితే మార్చిలో టెట్ నోటిఫికేషన్ ప్రకటించి, ఏప్రిల్‌లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. అలాగే డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ చివరి వారం లేదా మేలో వెలువరించి జూలై నాటికి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. టెట్, డీఎస్సీ కలిపి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అదేవిధంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 1,867 కొత్త నియామకాలు జరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో అత్యధికంగా 989 టీచర్ పోస్టులు ఖాళీ ఉండ గా, నిర్మల్ జిల్లాలో అతితక్కువగా 175 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఐదేళ్ల తర్వాత.. : ఉపాధ్యాయ వృత్తి చేపట్టడానికి ఆశతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఐదేళ్లుగా అవకాశాలు లేవు. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డీఎ స్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడమే చివరిది. అప్పటి నుంచి నిరుద్యోగులు ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్ వస్తుందని ఆశతో ఉన్న వారికి రెండున్నరేళ్ల తరువాత ఉప ముఖ్యమంత్రి ప్రకటన ఊపిరినిచ్చింది. నాలుగు జిల్లాల్లో కలిపి 1,867 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థుల శాతం తక్కువగా ఉన్న పాఠశాలలను విలీనం చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఖాళీల సంఖ్యలో మార్పులు ఉంటాయా అన్న విషయాన్ని ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కాగా.. ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరిస్తే నాలుగు జిల్లాల్లో 1ః28 చొప్పున సుమారు 55 వేల మంది పోటీపడే అవకాశాలు ఉన్నాయి. కుమ్రంభీంలోనే అధిక ఖాళీలు.. : ఉమ్మడి పరి ధిలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనే అత్యధిక ఖాళీలు ఉన్నాయి. ఈ జిల్లాలో అన్ని విభాగాల్లో కలిపి 989 పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. మారుమూల మండలాలైన బెజ్జూరు, కెరమెరి, తిర్యాణి, కౌటాల, సిర్పూర్(టి), చింతల్మానేపల్లి, దహెగాం, వాంకిడి, జైనూర్ మండలాల్లోని ప్రాథమిక పాఠశాలల్లోనే అత్యధిక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి, నెన్నెల, భీమిని, భీమారం, కాసిపేట, అదే విధంగా నిర్మల్ జిల్లాలోని కడెం, పెంబి, కుంటాల, సారంగాపూర్, ఖానాపూర్, లోకేశ్వరం, ఆదిలాబాద్ జిల్లాలోని బేల, జైనథ్, నేరడిగొండ, నార్నూర్, ఉట్నూర్, తలమడుగు, ఇంద్రవెల్లి మండలాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఎక్కువగా ఖాళీ ఉన్నట్టు సమాచారం. -
నిధుల విడుదలలో మమః అనిపిస్తున్నారు!
సాక్షి,సిటీబూరో: వెనుకబడిన తరగతుల కార్పొరేషన్లకు బ్యాంక్ లింకేజీ సబ్సిడీ రుణాలు పూర్తి స్థాయిలో విడుదల కాలేదు . మచ్చుకు కొన్ని నిధులను మాత్రమే విడుదల చేసి ప్రభుత్వం చేతులు దూలుపుకోవడంంతో లబ్ధిదారులు బ్యాంక్ లింకేజీ సబ్సిడీ రుణాల కోసం బీసీ కార్పొరేషన్లు, బ్యాంకుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో భాగంగా ఏటా బ్యాంకు లింకేజి సబ్సిడీ రుణాలల్లో భాగంగా 2015–16 ఆర్థిక సంవత్సరానికి గాను హైదారాబాద్– రంగారెడ్డి జిల్లాల్లోని బీసీ కార్పొరేషన్ల పరిధిలో 3,029 యూనిట్లకు రూ.23.42 కోట్లు మంజూరయ్యాయి. ఇందుకు అధికారయంత్రాంగం ఫిబ్రవరిలో లబ్ధిదారులను ఎంపిక చేసింది. అయితే ఆగస్టు చివరి వారంలో ప్రభుత్వం 820 యూనిట్లకుగాను రూ. 5.87 కోట్లు విడుదల చేసింది. మిగతా 2,209 యూనిట్లకు సంబంధించి రూ. 17.55 కోట్లు విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు రెండు వారాలుగా బీసీ కార్పొరేషన్ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టు తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాల పునర్విభజన ప్రక్రియ నేపథ్యంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడుతున్న నేపథ్యంలో తమకు సబ్సిడి రుణాలు వస్తాయో ..రావోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. – మిగతా కార్పొరేషన్లు అంతే ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్లకు సంబంధించిన బ్యాంక్ లింకేజీ సబ్సిడి రుణాల పరిస్థితి అలాగే ఉంది. ఆయా కార్పొరేషన్లకు ప్రభుత్వం సగం నిధులు మాత్రమే విడుదల చేయటంతో లబ్ధిదారులు అందోళన చెందుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉపాధి కల్పనలో భాగంగా చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు పూర్తి స్థాయిలో నిధులు రాలేదు. ఎస్సీ కార్పొరేషన్ 1581 యూనిట్లకు గానూ రూ.21 కోట్లకు ప్రతిపాదనలు పంపగా, 1225 యూనిట్లకు గానూ రూ.17.86 కోట్లు విడుదల చేసింది. మిగతా 356 యూనిట్లకు గానూ రూ. 3.14 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఎస్టీ కార్పొరేషన్‌కు సంబంధించి 73 యూనిట్లకు గానూ 67 యూనిట్లకు మాత్రమే రూ. 1.10 లక్షలు విడుదలయ్యాయి. వికలాంగుల సంక్షేమ శాఖకు 76 యూనిట్లకు గానూ 22 యూనిట్లకు రూ.19 లక్షలు విడుదలయ్యాయి. -
జాబుల జాడే లేదు
ముషీరాబాద్: తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగమని, బాబు వస్తే జాబు వస్తుందని హామీలిచ్చిన కేసీఆర్, చంద్రబాబు గద్దెనెక్కి 27 నెలలు గుడుస్తున్నా ఉద్యోగాల జాడ లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. నిరుద్యోగులు ఐక్యంగా ఉద్యమిస్తేనే ప్రభుత్వాలు దిగివస్తాయన్నారు. సోమవారం ముషీరాబాద్‌లోని కషీష్ ఫంక్షన్హాల్లో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల నిరుద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగాలు భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు టీచర్ పోస్టులు మినహా ఏ ఒక్క పోస్టునూ భర్తీ చేయలేదన్నారు. ఏపీలో 1.45లక్షల ఖాళీలు ఉండగా, 10వేల ఉద్యోగాల భర్తీకి మంత్రి వర్గం నిర్ణయించడం దారుణమన్నారు. గ్రూప్ – 1,2,3 పోస్టులను పాత పద్దతిలోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కాంట్రాక్టర్లకు, నీళ్లను సముద్రానికి, నియామకాలను గాలికి వదిలేసిందన్నారు. ఇప్పటి వరకు కేవలం 3వేల ఇంజనీరింగ్ పోస్టులు, పోలీస్ ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు విడుదల చేశారన్నారు. గ్రూప్ – 2 సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. సంస్కరణలు ఉద్యోగ భర్తీలో కాకుండా రాజకీయాల్లో ప్రవేశపెట్టాలన్నారు. కార్యక్రమంలో గుజ్జకృష్ణ, శ్రీనివాస్‌గౌడ్, సయ్యద్ పాల్గొన్నారు. -
మరో మోసం!
నిరుద్యోగులను వంచించిన సీఎం చంద్రబాబు నాడు ఉద్యోగాలు అన్నారు....శిక్షణ ఇచ్చారు నెలలు గడుస్తున్నా పిలుపూ లేదు...కొలువూ లేదు ఘొల్లుమంటున్న రాజధాని ప్రాంత యువతీయువకులు గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు హామీలకు రైతులు, రైతు కూలీలే కాదు నిరుద్యోగ యువకులు కూడా బోల్తా పడ్డారు. భూ సమీకరణ సమయంలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతు కుటుంబాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నైజం తెలిసిన కొందరు రైతులు భూములు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేశారు. అయితే ఆ కుటుంబాల్లోని నిరుద్యోగ యువతీ యువకులు సీఎం మాటల గారడీకి పడిపోయారు. భూములు ఇప్పించేందుకు తల్లిదండ్రులు అంగీకరించే విధంగా చేశారు. కొందరు యువకులైతే తల్లిదండ్రులను బెదిరించారు కూడా. భూములు ఇస్తే, దానికి ప్రతిఫలంగా నివేశన స్థలం, ఐదు సంవత్సరాల పాటు కౌలు చెక్కులు, తమకు మంచి ఉద్యోగాలు వస్తాయని, ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ఎందుకు భూములు ఇవ్వరని తల్లిదండ్రులను కొందరు యువకులు నిలదీశారు. వీరి ఒత్తిడికి తలొగ్గి భూములు ఇస్తే, తీరా భూములకు తగిన విధంగా సొంత గ్రామంలో స్థలం ఇవ్వడం లేదు. నిరుద్యోగులకు శిక్షణ కల్పించి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామీ నెరవేరకపోవడంతో యువతీ యువకులు ఆందోళన చెందుతున్నారు. సుక్షేత్రమైన మాగాణి ఉండి ఉంటే వ్యవసాయం అయినా చేసుకునే వారమని, లేకుంటే అమ్ముకుని వ్యాపారం అయినా చేసుకునే వారమని, బాబును నమ్మి నట్టేట మునిగి పోయాయని, తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఉద్యోగాలు వదిలి .... భూ సమీకరణకు ముందు రాజధాని గ్రామాల్లోని యువతీయువకులు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవారు. సుమారు 110 మంది వరకు బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులకు సీఆర్డీఏ పరిధిలో ఉద్యోగాలు ఇస్తామని, ముందుగా వారికి మంచి శిక్షణ ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో ఇతర ప్రాంతాల్లో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు జీతాలు తీసుకుంటున్న వారు ఆ ఉద్యోగాలకు రాజీనామా చేసి స్వగ్రామాలకు చేరుకున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఐదునెలల క్రితం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చింది. వర్సిటీ హాస్టల్లో ఉంటున్న ఈ నిరుద్యోగులను విద్యార్థిని రిషితేశ్వరీ కేసు నేపథ్యంలో అక్కడి నుంచి పంపి వేశారు. ఇంటికి చేరుకుని రెండు నెలలు గడిచినా అధికారుల నుంచి పిలుపు రావడం లేదు. చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదిలి, స్వగ్రామానికి వచ్చిన వీరికి ఇక్కడా ప్రభుత్వం ఉపాధి కల్పించకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర మానసిక వ్యధకు గురవుతున్నారు. ఉపాధి అవకాశాల కోసం సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సీఆర్డీఏ ఉన్నతాధికారులను కలిసి తమ గోడు వినిపించుకుంటున్నారు. అయినా సమస్య కొలిక్కి రావడంలేదు. మూడు రోజుల క్రితం సీఆర్డీఏ స్కిల్ డెవలప్మెంట్ డెరైక్టర్ జయదీప్‌ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. అయితే శిక్షణ పొందిన నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలంటే కనీసం రెండేళ్లు పడుతుందని అధికారుల కథనం. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు స్థాపించకుండా ఉపాధి కల్పించే అవకాశాలు లేవని చెబుతున్నారు. అలాగే డిగ్రీ, పీజీ చేసిన నిరుద్యోగులు నాలుగు వేల మంది వరకు ఉంటే వారి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. దీంతో నిరుద్యోగులు ఉపాధి కోసం మళ్లీ ఇతర నగరాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఉద్యోగం రాలేదు.. సీఎం చంద్రబాబు మా ఊరిలో ఉద్యోగం ఇస్తామన్నారు. ఎంతో ఆశపడ్డాను. వారు ఇచ్చిన శిక్షణ తీసుకున్నాను. మొదట సీఆర్‌డీఏలోనే ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఉద్యోగం మాత్రం రాలేదు. - బండి రోశయ్య, అబ్బురాజుపాలెం ఆశ పడ్డాం ... రాజధానిలోనే ఉద్యోగం అంటే ఎంతో ఆశపడ్డాం. సొంత ఊరిలోనే ఉద్యోగం కల్పిస్తామని సంబరపడ్డాం. వారు చెప్పిన విధంగా శిక్షణ తీసుకున్నాం. రెండునెలలుగా ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నాం. - మేకల దివ్య, తుళ్ళూరు -
నిత్య సమరం
హామీల అమలు కోరుతూ అంగన్వాడీల సమరశంఖం పోస్టుల భర్తీ కోసండీఎస్సీ అభ్యర్థుల పోరుబాట కనీస వేతనం కోసంవీఆర్ఏల నిరవధిక దీక్షలు ఉద్యోగులుగా గుర్తించాలని గళమెత్తిన గోపాలమిత్రలు ఉద్యమాలకు వేదికగా మారిన విజయవాడ నగరం కాలే కడుపులు కాపాడమంటున్నాయి.. ఉద్యోగ భద్రత కోసం ఆక్రోశిస్తున్నాయి.. ఉపాధి కోసం ఎదురుచూస్తున్నాయి.. హామీలు అమలుచేసి ఆదుకోమంటున్నాయి.. తమ సమస్యలు పరిష్కరిస్తామని, ఉజ్వల భవిత కల్పిస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోరుతూ ప్రభుత్వంపై పోరాటాలకు గళమెత్తుతున్నాయి. అంగన్వాడీలు, వీఆర్ఏలు, డీఎస్సీ 2014 అభ్యర్థులు, ఔట్సోర్సింగ్ కార్మికులు, గోపాలమిత్రలు, ఆశా వర్కర్లు.. ఇలా ఒక్కొక్కరు రోడ్డెక్కుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. నూతన రాజధాని విజయవాడ నగరం నిత్యం బడుగుజీవుల బతుకుపోరుతో హోరెత్తుతోంది. సమరశీల ఉద్యమాలకు వేదికగా మారుతోంది. దీనిపై ప్రత్యేక కథనం. లెనిన్ సెంటర్... ప్రస్తుతం హాట్‌టాపిక్. చర్చంతా ఇక్కడే. నూతన రాజధాని విజయవాడ నగరం మధ్యలో ఓ ప్రధాన కూడలిగా ఉంది. ఈ ప్రాంతం ప్రస్తుతం సమరశీల ఉద్యమాలకు వేదికైంది. ప్రజల సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఇక్కడి నుంచే తమ వాణిని రాష్ట్ర, దేశ ప్రజలకు వినిపిస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలతో నిరసన తెలుపుతున్నారు. ప్రజాసంఘాలు, నిరుద్యోగ యువత, ఉద్యోగ భద్రత కరువైన వివిధ విభాగాల ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఇక్కడే నిత్యం సమరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం. విజయవాడ : నగరంలో నిరుద్యోగులు, భద్రత కరువైన ఉద్యోగులు నిత్యం సమరం చేస్తున్నారు. ప్రభుత్వం చాలీచాలని వేతనం ఇవ్వడం, హా మీలు నిలబెట్టుకోవడంలో విఫలం కావడంతో ఉద్యోగులు వీధుల్లోకి వచ్చారు. వీరందరి ఆందోళనకు లెనిన్ సెంటర్ వేదికైంది. పోలీసులకు చేతినిండా పని పెరిగింది. అంగన్వాడీల ఆందోళన ఒక కుటుంబం బతకాలంటే కనీసం రూ.10 వేలు కావాలి. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పని చేస్తున్న అంగన్వాడీ కార్యర్తలు, ఆయాల పరిస్థితి దీనంగా ఉంది. పేరుకు ప్రభుత్వ ఉద్యోగులు. చేసేది వెట్టిచాకిరీ. కొత్తగా అధికారంలోకి వచ్చి న ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్యకర్తకు రూ.7,100, ఆయా కు రూ.4,800ల వేతనాన్ని సెప్టెంబరు ఒకటి నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కానీ అమలు జరగలేదు. వామపక్ష పార్టీల నేతల అండతో వీరు ఈనెల 10 నుంచి రిలే దీక్షలను లెనిన్ సెంటర్లో చేశారు. 18న సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించగా పోలీ సుల అణచివేత వైఖరి కారణంగా పలువురు గాయపడ్డారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించారు. పోలీసుల రాక్షసత్వాన్ని తప్పుపట్టారు. దీంతో వచ్చే సంవత్సరం హామీని నెరవేరుస్తామని ప్రభుత్వం ప్రకటించినా అంగన్వాడీల్లో వేడి కొనసాగుతూనే ఉంది. డీఎస్సీ అభ్యర్థుల.. ఉపాధ్యాయ నియామకాలకు 2014 సంవత్సరంలో డీఎస్సీ పరీక్ష నిర్వహించారు. మెరిట్ జాబితా ప్రకటించలేదు. రాష్ట్రంలో పోస్టులు ఖాళీగా ఉన్నా యి. రెండేళ్లయినా ఉద్యోగాల మాట ఎత్తకపోవడంతో వీరు ఆందోళన బాట చేపట్టారు. ఈనెల 21న సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి విఫలయత్నం చేశారు. 1998లో నిర్వహించిన డీఎస్సీకి ఇంతవరకు దిక్కులేదు. తప్పకుండా వీరికి ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ గాలిమాటగా మారింది. దీంతో వీరు కూడా ఆందోళన చేపట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగులను తీసుకున్నది. కొన్ని శాఖలు పది వేలు నెలకు ఇస్తుండగా కొన్ని శాఖలు ఆరు వేలు, ఐదు వేలే ఇస్తున్నాయి. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో ఇవ్వాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. వీరి ఆందోళనకు కూడా లెనిన్ సెంటర్ వేదికైంది. మంగళవారం నుంచి రిలే దీక్షలు చేపట్టారు. ఆశాల దీక్షలు.. నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్లలోని ఆశా వర్కర్లు కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. కార్పొరేషన్ వారు రూ.4,500 జీతం ఇస్తుంటే వైద్యారోగ్య శాఖ వారు రూ.10 వేలు ఇస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని తీసేసి పది వేలు ఇవ్వాలని ఆశా వర్కర్లు కోరుతూ ఆందోళన చేస్తున్నారు. వీఆర్ఏల ఆందోళన రెవెన్యూ శాఖలో కీలక వ్యవస్థగా ఉన్న గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ల ఆందోళన 51 రోజులుగా సాగుతోంది. వీరు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. డీఎస్సీ (డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ) ద్వారా ఎంపికైన వారు. వీరికి కూడా కనీస వేతనం లేదు. తమకు కనీస వేతనంతోపాటు ప్రమోషన్లలో 70 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కోటా 30 శాతంగా ఉంది. వీరికి ప్రస్తుతం ఇచ్చే జీతం ఆరువేలు. ఈ జీతాన్ని వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లెనిన్ సెంటర్లో ఆందోళన చేస్తున్నారు. ఐదుగురు వీఆర్ఏలు రిలే దీక్షలు చేశారు. వీరిని ఈనెల 19న అరెస్ట్ చేశారు. దీంతో ఆగ్రహించిన వీఆర్ఏలు గుణదలోని ఒక సెల్‌టవర్ ఎక్కి అక్కడి నుంచి దూకి చనిపోతామని హెచ్చరించారు. గోపాల మిత్రలు పశువైద్య శాఖ వారు కాంట్రాక్ట్ పద్ధతిపై గోపాల మిత్రలను గ్రామాల్లో ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పశువులకు వ్యాధులు వస్తే ఇంటి వద్దకే వెళ్లి పశువైద్యం చేస్తారు. వీరికి కూడా కనీస వేతనం అమలు జరగటం లేదు. నెలకు రూ.3,500లు జీతం ప్రభుత్వం ఇస్తున్నది. వీరు 15 సంవత్సరాలుగా చేస్తున్నారు. వీరిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ శనివారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
అసలే తక్కువ.. ఆపై ఆలస్యం
వసతి గృహాల్లో ట్యూటర్ల దుస్థితి నాలుగు నెలల నుంచి అందని వేతనాలు పెరిగిన నిత్యావసరాలతో అవస్థలు పట్టించుకోని అధికారులు ప్రభుత్వ వసతి గృహాల్లో ట్యూటర్లుగా పని చేస్తున్న నిరుద్యోగులు వేతనాలు అందక పస్తులుండాల్సి వస్తోంది. డీఎస్సీ పరీక్షలు రాసి పోస్టులు రాక ట్యూటర్లుగా మారిన వీరు చాలీచాలని వేతనాలకే విధులు నిర్వహిస్తున్నారు. అవి కూడా సక్రమంగా రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతలో కీలక పాత్ర పోషించే వీరికి నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వక పోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నారుు. పెదకూరపాడు కృష్ణాజిల్లాలో 40 ప్రత్యేక ఎస్సీ వసతి గృహాలు ఉన్నారుు. వీటిలో సబ్జెక్టుల వారీగా పాఠాలు బోధించే ట్యూటర్లు 160 మంది పనిచేస్తున్నారు. అలాగే 50 ప్రత్యేక బీసీ వసతిగృహాల్లో 176 మంది ఉన్నారు. గుంటూరు జిల్లాలో 45 ఎస్సీ ప్రత్యేక వసతి గృహాలు ఉన్నారుు. వీటిలో 185 మంది ట్యూటర్లు పని చేస్తున్నారు. వీరందరికీ సబ్జెట్‌కు రూ.1500 చొప్పున వేతనం ఇవ్వాల్సి ఉంది. కానీ గుంటూరు జిల్లాలో పని చేసే ట్యూటర్లకు ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల వేతనాలు ఇంత వరకు చెల్లించలేదు. పలు గృహాల్లో వేతనాలు మంజూరైనా ట్యూటర్లకు అందని పరిస్థితి నెలకొంది. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఒక వైపు, అందని వేతనాలు మరోవైపు ట్యూటర్లను ఆవేదనకు గురి చేస్తున్నారుు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతలో ట్యూటర్ల పాత్ర కీలకమైంది. వసతి గృహాల్లోని విద్యార్థులకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు, రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు విద్యార్థులకు బోధిస్తున్నారు. ఆంగ్లం, లెక్కలు, హిందీ, సైస్స్ బోధిస్తూ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఇటువంటి ట్యూటర్లకు వేతనాలు చెల్లించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నారుు. వేతనాలు వెంటనే ఇవ్వాలి పండుగ రోజుల్లో వేతనాలు లేక పస్తులుంటున్నాం. నిరుద్యోగుల గోడు పట్టించుకునే నాథుడే లేరు. నాలుగు నెలల వేతనాలు బకాయిలు ఉన్నాయి. వెంటనే చెల్లించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేలా చూడాలి. -కంచర్ల కృష్ణ, ట్యూటర్, పెదకూరపాడు కష్టానికి తగ్గ ఫలితంలేదు వసతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థులు ఆంగ్లం, గణితం సబ్జెక్టులు బోధిస్తున్నాం. విద్యార్థుల ఉత్తీర్ణతలో కీలకపాత్ర పోషిస్తున్నాం. అరుునా మా కష్టానికి తగ్గ ఫలితం ఉండటంలేదు. అరకొర వేతనాలు కూడా ఆలస్యంగా ఇస్తున్నారు. -షేక్ హఫీజ్, ట్యూటర్ -
ఇంకెన్నాళ్లీ నిరీక్షణ?
ఏటా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం.. అన్న పాలకుల మాటలు నిరుద్యోగులు నిజమేనని నమ్మారు. చెప్పినట్టే నోటిఫికేషన్ ఇవ్వడంతో సంబరపడిపోయారు. పొట్ట పోసుకునేందుకు అప్పటి వరకు చేస్తున్న చిన్నా చితకా ఉద్యోగాలు వదిలేసి పరీక్షలకు సిద్ధమయ్యా రు. కొందరైతే అప్పు చేసి మరీ కోచింగ్ సెంటర్లలో చేరి డీఎస్సీ కోసం శిక్షణ పొందారు. పరీక్షలు ముగిశాయి. ఆ వెంటనే కీ విడుదలైంది. మార్కులు అంచనా వేసుకున్న ప్రతిభావంతులు తమకు ఉద్యోగం ఖాయమని, ఇక బాధ్యతలు స్వీకరించమే తరువాయి అని భావిం చారు. మెరిట్ జాబితా కోసం ఆర్నెల్ల నిరీక్షిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కనికరించలేదు. కోర్టు మెట్లెక్కినా.. మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించినా వీరి ఆశలు మాత్రం ఫలించలేదు. - వినుకొండ టౌన్ గత ఏడాది నవంబర్‌లో నోటిఫికేషన్... జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల భ ర్తీకి గత ఏడాది నవంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటికే రెండేళ్ల నుంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో వేలాది రూపాయలు పెట్టి కోచింగ్‌లకు వెళ్లారు. 951 పోస్టులకు గాను జిల్లా అధికారులకు 33,365 దరఖాస్తులు అందాయి. ఈ ఏడాది మే 9, 10, 11 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. అనంతరం పాథమిక, తుది కీలను కూడా విడుదల చేశారు. తుది కీలో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ అక్కడి నుంచి ప్రక్రియను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం లేదు. దీంతో జిల్లాలో డీఎస్సీ పరీక్షలు రాసిన 33 వేల మంది అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా ర్యాంకర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని తెలిసి, ప్రైవేటు యాజమాన్యాలు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో వారు ఖాళీగా కాలం గడుపుతుంటే మరి కొందరు ర్యాంకర్లు కూలి పనులకు వెళ్తున్నారు. బాబొస్తే జాబొస్తుందని నమ్మిన నిరుద్యోగులు నిలువునా మునిగిపోతున్నారు. హైకోర్టు, ట్రిబ్యునల్‌లో కేసులు.. ప్రతి డీఎస్సీకీ అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించటం సహజం. కానీ 2014 డీఎస్సీ మాత్రం ప్రత్యేకం. సుమారు 1836 కేసులు హైకోర్డు, ట్రిబ్యునల్‌లో అభ్యర్థులు దాఖలు చేశారు. టెట్ కం టీఆర్టీ రద్దు చేయాలనే ప్రధానమైన కేసును ఆగస్టు 6న హైకోర్డు కోట్టి వేసింది. మిగిలిన కేసులన్నీ ప్రభుత్వం విడుదల చేసిన తుది కీలపై ట్రిబ్యునల్‌లో దాఖలైనవే. వీటిని కుదించి 23 కేసులుగా ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. గత డీఎస్సీల్లోనూ కోర్టు కేసులు ఉన్నప్పటికీ తుది తీర్పుకు లోబడి నియామకాలు చేపట్టారని, ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టంలేని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆల్యం చేస్తోందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగుల గోడు ఆలకించి డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల చేయాలని కోరుతున్నారు. అప్పుచేసి కోచింగ్ తీసుకున్నా.. లక్షరూపాయలు అప్పుతీసుకుని నేనూ నా భార్య కోచింగ్ తీసుకున్నాం. స్కూల్ అసిస్టెంట్ సోషలోలో నాకు 145.97 మార్కులు వచ్చాయి. జిల్లాలో 9వ ర్యాంకు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలు ఇవ్వకపోవడంలో తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లిస్తూ ఖాళీగా ఉన్నాను.నిరుద్యోగుల గోడు విని మెరిట్ జాబితా విడుదల చేసి నియామకాలు చేపట్టాలి. - కె.బి.ఎన్.శేఖర్, జిల్లా 9వ ర్యాంకు, ఎస్ఎ సోషల్ మంత్రులకు విన్నవించాం... నియామకాలు చేపట్టాలని మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. 2012 డీఎస్సీ మూడు నెలల్లోనే ప్రక్రియా ముగిసింది. ఈ డీఎస్సీకి మాత్రం ఎదురు చూపులు తప్పడం లేదు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే వెంటనే ఇవ్వవచ్చు. - వి.అనిల్‌కుమార్, ఎస్జీటీ అభ్యర్థి -
ఉద్యోగాలివ్వలేం.. నిరుద్యోగులతో సీఎం
హైదరాబాద్: రాష్ట్రం లోటులో ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేమని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడు లగుడు గోవిందరావు విలేకరులకు తెలిపారు. శనివారం సీఎం క్యాంపు కార్యాల యంలో చంద్రబాబును కలసి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము.. ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం దారుణమన్నారు. ఖాళీల భర్తీ కోరు తూ కోర్టులో కేసు వేశామని, ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశామని చెప్పినా సీఎం పట్టించుకోవడం లేదన్నారు. ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆంధ్రా మేధావుల ఫోరం వ్యవస్ధాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఏపీ విద్యార్థి జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల విభజన సాకుతో నియామక ప్రక్రియను నిలుపుదల చేయడం తగదన్నారు. -
చదువక్కర్లేదు.. వయసుతో పన్లేదు!
జూపాడుబంగ్లా: నిరుద్యోగుల ఆశలను కొందరు యువకులు సొమ్ము చేసుకున్నారు. కం పెనీ ఉద్యోగాలని.. లక్షల్లో జీతాలని నమ్మబలికి ఏకంగా 600 మందిని బురిడీ కొట్టించారు. చదువుతో పనిలేదని.. వయసుతో నిమిత్తం లేదంటూ ఒక్కొక్కరి నుంచి రూ.8వేలు చొప్పున వసూలు చేశారు. శిక్షణ పేరిట మరో రూ.8వేలు గుంజారు. సుదూర రాష్ట్రాల్లో రెండు మూడు నెలలు నిర్బంధించి నరకం చూపారు. తాము మోసపోయామని తెలుసుకుని అక్కడి నుంచి బయటపడిన బాధితులు కొందరు శనివారం జూపాడుబంగ్లా ఎస్ఐ గోపినాథ్ ఎదుట తమ గోడు వినిపించారు. వివరాల్లోకి వెళితే.. జలకనూరు గ్రామానికి చెందిన పాణ్యం వేణుగోపాల్, షేక్‌అహమ్మద్ బాషా, హబీవుల్లా, చాంద్ అనే యువకులు తాము గ్లాజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నామని జూపాడుబంగ్లా, పాములపాడు మండలాల్లో స్నేహితుల ద్వారా నిరుద్యోగ యువతతో పరిచయం పెంచుకున్నారు. రూ.8వేలు చెల్లిస్తే తమ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంతో జూపాడుబంగ్లా మండలంలోని తరిగోపుల, 80.బన్నూరు గ్రామాలతో పాటు పాములపాడు మండలంలోని చెలిమిల్ల, లింగ ాల, కొత్తబానకచర్ల, మిడ్తూరు మండలంలోని జలకనూరు, గూడూరు తదితర గ్రామాలకు చెందిన సుమారు 600 మంది వారి మాయలో పడ్డారు. ఒక్కొక్కరి నుంచి రూ.16వేలు చొప్పున దాదాపు రూ.కోటి వసూలు చేశారు. నమ్మించేందుకు కొందరికి గుర్తింపు కార్డులను సైతం ఇచ్చేశారు. గత మార్చిలో కొందరు యువకులను శిక్షణ నిమిత్తం ఉత్తరప్రదేశ్‌లోని కాశీ వద్దనున్న గాజ్పూర్లో రెండు నెలలు, బీహార్‌లో రెండు నెలలు నిర్బంధిం చారు. చివరకు తాము మోసపోయామని తెలుసుకున్న యువకులు తల్లిదండ్రుల ద్వారా బ్యాంకుల్లో నగదు వేయించుకుని ఇంటికి తిరుగుపయనమయ్యారు. అయితే గూడూరుకు చెందిన శివ అనే వ్యక్తి శిక్షణ నిమిత్తం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి ఇప్పటికీ తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. గత రెండు రోజులుగా బాధితులు జూపాడుబంగ్లా ఎస్ఐ గోపినాథ్‌ను కలిసి తమ గోడు వినిపిస్తున్నారు. శనివారం కొత్తబానకచర్లకు చెందిన నాగభూషణం, లింగాలకు చెందిన చిన్నకొలమయ్య, అశోక్‌లు ఎస్ఐని కలిసి మోసపోయిన తీరును వివరించారు. అనంతరం ఎస్ఐ విలేకరులతో మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామన్నారు. ఇప్పటికే షేక్‌అహమ్మద్ బాషా, హబీవుల్లా, చాంద్‌లను అదుపులోకి తీసుకోగా.. వేణుగోపాల్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. అదుపులోని ముగ్గురు యువకులు తాము కూడా మోసపోయామని చెబుతున్నారని.. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూరుస్తామన్నారు. -
కొలువుల కోసం బారులుతీరిన యువత
జాబ్‌మేళాకు అనూహ్య స్పందన వెంకటగిరిటౌన్ : కొలువుల కోసం నిరుద్యోగ యువత బారులుతీరారు. నేదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంకటగిరిలోని నేదురుమల్లి భవనంలో శనివారం నిర్వహించిన జాబ్‌మేళాకు అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన జాబ్‌మేళాకు సుమారు 5 వేల మంది నిరుద్యోగులు హాజరైనట్లు అంచనా. ఫౌండేషన్ చైర్మన్ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ఆశయ సాధనలో భాగమే జాబ్‌మేళా నిర్వహణ అన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమా, బీటెక్ వంటి కోర్సులకు 18 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఇంటర్య్వూలు నిర్వహించారు. జాబ్‌మేళాకు నియోజకవర్గంలో వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, సైదాపురం, రాపూరు, కలువాయి మండలాల నుంచి అధిక సంఖ్య లో యువత, వారి తల్లిదండ్రులు హాజరుకావడంతో స్థానిక క్రాస్‌రోడ్డు కూడలి, రైల్వేస్టేషన్ రోడ్లు జనంతో కిక్కిరిశాయి. రైల్వేస్టేషన్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించడంతో వెంకటగిరి - నాయుడుపేట మార్గంలో బస్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. నాయకులకు నో ఎంట్రీ... జాబ్‌మేళాకు హాజరైన అభ్యర్థులు మినహా నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను నేదురుమల్లి నివాసంలోకి అనుమతించలేదు. ఈ కార్యక్రమానికి సహకరించాలని పార్టీ నాయకులకు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్వయంగా చెప్పారు. మేము సైతం..: సైదాపురం మండలం చాగణం రాజుపాళేనికి చెందిన బి. శ్రీనివాసరావు (మరుగుజ్జు) బీఈడీ, వెంకటగిరి పట్టణానికి చెందిన ఎస్ హరిబాబు (అంధ విద్యార్థి) ఇంటర్, పి. సుబ్బరాయులు (వికలాంగుడు) జాబ్‌మేళాకు హాజరయ్యారు. -
జగన్ నాయకత్వం అవసరం
మిథున్,చెవిరెడ్డి నాకురెండు కళ్లు -పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజారుుతీకి మారుపేరు చెవిరెడ్డి - నారాయణస్వామి ఆదరించండి .. అభివృద్ధి చేసి చూపిస్తా - చెవిరెడ్డి బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చిన జనం చంద్రగిరి, ఎర్రావారిపాళెం, న్యూస్‌లైన్: ‘తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలను చంద్రబాబు భయబ్రాంతులకు గురిచేశాడు..మూడేళ్ల కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన అడుగడుగునా చంద్రబాబును గుర్తుచేసింది. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది’ అని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనను గుర్తు చేసుకుని ఇప్పటికీ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులను బాబు ముప్పుతిప్పలు పెట్టించారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని గెలిపించి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలంలో బుధవారం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తనకు మిథున్ ఎలాగో చెవిరెడ్డి భాస్కరరెడ్డి అంతేనని అన్నారు. వారిద్దరూ రెండు కళ్లులాంటివారన్నారు. చెవిరెడ్డి నిజాయతీకి మారుపేరని, ఎన్నికల్లో చెవిరెడ్డిని ఆదరించాలని కోరారు. చెవిరెడ్డి ఎమ్మెల్యే అరుుతే పార్టీలకతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఈ మండలంలో తాను నిర్మించిన రెండు ప్రాజెక్టుల వల్లే నీటి సమస్య పరిష్కారం అయిందన్నారు. అయితే ప్రాజెక్టుల నిర్మాణాల్లో నష్టపోయిన వారికి ఇంతవరకూ పరిహారం చెల్లించక పోవడం దారుణమన్నారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయిన వెంటనే బాధితులకు నష్టపరిహారం చె ల్లిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి మాట్లాడుతూ గల్లా అరుణకుమారిలా చెవిరెడ్డి భాస్కరరెడ్డి పైరవీలు, మాయమాటలు చెప్పి రాజకీయం చేసేవ్యక్తి కాదన్నారు. కష్టపడే తత్త్వం, నమ్మిన వారికి అండగా నిలవడం, అభివృద్ధి చేయాలనే సంకల్పం భాస్కర్‌రెడ్డి నైజమని తెలిపారు. గాలి ముద్దకృష్టమనాయుడు, చెంగారెడ్డి పేదల శవాలవద్ద ఫొటోలకు ఫోజులిచ్చి పేపర్లో వేయించుకుని నీచ రాజకీయాలు చేసే వారని ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్‌రాజశేఖరరెడ్డి ఏనాడూ కులమాతాల ప్రస్తావన తీసుకురాలేదన్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబునాయుడు ఆల్‌ఫ్రీ మాటలను నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు. దెబ్బలు, బూట్ల తన్నులే మిగిలాయి టీడీపీ పాలనలో ప్రజలకు లాఠీ దెబ్బలు, బూట్ల తన్నులే మిగిలాయని వైఎస్సార్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్‌రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు రాష్ట్రంలో చంద్రబాబు భయానక పాలన సాగిందన్నారు. బాబు పాలనలో వృద్ధులకు, వితంతువులకు రూ. 70 పింఛన్ ఇచ్చేవారన్నారు. అదనంగా ఇవ్వాలంటే పింఛన్ తీసుకుంటున్న వారిలో ఎవరోఒకరు చనిపోవాలన్నారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ నాడు ఉండే దన్నారు. ఎన్నికల ముందు కిలో బియ్యం రూ. 2 కే ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5 కు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు. తొమ్మిదేళ్ల బాబు పాలనలో ప్రజలు నరకం చూశారని అన్నారు. ఎవరూ చేయని విధంగా రాజశేఖరరెడ్డి ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఆయన రుణం తీర్చుకోవాలంటే జగన్మోహన్రెడ్డిని సీఎంని చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామన్నారు. అమ్మఒడి పేరుతో బిడ్డను బడికి పంపించే తల్లి బ్యాంకు ఖాతాలో నెలకు రూ. 500 జమ అవుతుందని తెలిపారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రెండు ముక్కలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు సహకరించిన మన జిల్లాకు చెందిన కిరణ్, చంద్రబాబు సీమాంధ్ర ద్రోహులని మండిపడ్డారు. చంద్రగిరి నియోజకవర్గానికి గల్లా అరుణకుమారి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. రాన్నున ఎన్నికల్లో తనను ఆదరిస్తే ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధిని చేసి చూపిస్తానని తెలిపారు. వైఎస్సార్ సీపీలో 500 మంది చేరిక వైఎస్సార్ సీపీ సేవాదళ్ కన్వీనర్ మహ్మద్‌అలీ, కార్యదర్శి వెంకటసిద్ధులు, నాయకులు దేవపట్ల నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 500 మంది వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేశ్వర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, రమేష్, మండల కన్వీనర్ వెంకట్రామిరెడ్డి, సర్పంచ్‌లు చెంగల్‌రెడ్డి, నడిపి రెడ్డెప్పరెడ్డి, మండల మహిళా కన్వీనర్ సుమ తి, మాజీ వీఆర్వో కృష్ణయ్య, శ్రీనివాసులు, శ్రీరాములు, ప్రభాకర్‌రెడ్డి, సహదేవరెడ్డి, రాజమణినాయక్, రమణ, వెంకటేష్, రెడ్డిమోహన్ పాల్గొన్నారు. బాబు తన సామాజిక వర్గం కోసమే ఓడించారు చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గెలుపుకోసం సొంత పార్టీ అభ్యర్థులను ఓడించిన నీచసంస్కృతి కలిగిన వ్యక్తని వైఎస్సాసీపీ కేంద్రకార్యనిర్వాహక మండలి సభ్యురాలు రోజా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు కులపిచ్చి ఎక్కువ అని, ఆ సామాజిక వర్గం అభ్యర్థులు విజయం కోసం సొంతపార్టీ అభ్యర్థులనే ఓడించేందుకు ఆయన వెనుకాడరని ధ్వజమెత్తారు. 1999 నుంచి 2009 వరకు టీడీపీ అభ్యున్నతి కోసం కూలీలా పనిచేశానన్నారు. 2009లో చంద్రగిరి అభ్యర్థిగా అవకాశం ఇచ్చనట్టేచ్చి తన సామాజిక వర్గానికి చెందిన అరుణకుమారి గెలుపుకోసం టీడీపీ నేతలు పరోక్షంగా కృషి చేశారన్నారు. కులపిచ్చి వదలి కనువిప్పు కలగాలంటే అన్ని వర్గాలవారు ఏకమై ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.