హైదరాబాద్: రాష్ట్రం లోటులో ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేమని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడు లగుడు గోవిందరావు విలేకరులకు తెలిపారు. శనివారం సీఎం క్యాంపు కార్యాల యంలో చంద్రబాబును కలసి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము.. ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం దారుణమన్నారు. ఖాళీల భర్తీ కోరు తూ కోర్టులో కేసు వేశామని, ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశామని చెప్పినా సీఎం పట్టించుకోవడం లేదన్నారు.
ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి
రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆంధ్రా మేధావుల ఫోరం వ్యవస్ధాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఏపీ విద్యార్థి జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల విభజన సాకుతో నియామక ప్రక్రియను నిలుపుదల చేయడం తగదన్నారు.
ఉద్యోగాలివ్వలేం.. నిరుద్యోగులతో సీఎం
Published Sun, Aug 9 2015 2:07 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement