ఘనంగా వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావ వేడుకలు | ysrcp fomation day celebrations in ap | Sakshi
Sakshi News home page

ఘనంగా వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావ వేడుకలు

Published Sun, Mar 12 2017 6:03 PM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM

ఘనంగా వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావ వేడుకలు - Sakshi

ఘనంగా వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో, ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని ఆమె పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాధించుకుందామని ప్రతిజ్ఞ చేయించారు. ఇక్కడ జరిగిన వేడుకల్లో పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, లక్ష్మీపార్వతీ, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు, కార్యకర్తలకు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. ప్రతి పేదవాడి కళ్లల్లో సంతోషం చూసే తరుణం మరెంతో దూరంలో లేదని, ఏడాదిలో అందరం ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గర్వంగా, ఆత్మసంతృప్తితో అందరం పనిచేసుకుంటూ ఎల్లకాలం ఇలాగే కొనసాగాలని అభిలషించారు.


వైఎస్ఆర్ జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి, అనంతరం కేక్ కట్ చేశారు. రైల్వేకోడూరులోని పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే కొరముట్ల నివాసులు పార్టీ జెండా ఎగురవేసి కార్యకర్తలతో కలిసి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. బద్వేల్ మండలం బయనపల్లె క్రాస్ వద్ద పార్టీనేత వెంకటసుబ్బయ్య, శింగనమల వెంకటేశ్వర్లు, జయసుబ్బారెడ్డిలు వైఎస్ఆర్ సీపీ జెండా ఆవిష్కరించి పలు కార్యక్రమాలు చేపట్టారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలో నేతలు ఆదిములం, సుదర్శన్ రెడ్డిలు పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. తిరుపతి ఎస్వీయూలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరిగాయి. అనంతపురం పట్టణంలో పార్టీ నేత శంకర్ నారాయణ, మైనార్టీ నేత నదీమ్ అహ్మద్, రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో, కల్యాణదుర్గంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎల్.ఎం.మోహన్‌రెడ్డిలు జెండా ఎగురవేసి, వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. విజయవాడలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి వెల్లంపల్లి శ్రీనివాస్, గౌతమ్‌రెడ్డిలు పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.


ప్రకాశం జిల్లా ఒంగోలులోని పార్టీ ఆఫీసులో బాలినేని నివాస్ రెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కేవీ రమణారెడ్డి, చుండురి రవి, సింగరాజు వెంకట్రావులు, చీరాలలో డా.అమృతపాణిలు పార్టీ వేడుకలను నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాయుడుపాలెంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి లింగం రవి ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు, రొట్టెలు, చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. నెల్లూరులో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో, కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్‌లో, గోపాలపురం నియోజకవర్గాల్లో అన్ని మండలాల కన్వినర్ల ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. శ్రీకాకుళంలోని పార్టీ ఆఫీసులో ధర్మాన ప్రసాదరావు, రెడ్డి శాంతి, రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు, పాలకొండలో ఎమ్మెల్యే వి.కళావతి, ఆముదాలవలసలోని పార్టీ ఆఫీసులో మాజీ మంత్రి తమ్మినేని సీతారామ్ వైఎస్ఆర్ సీపీ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద తెలంగాణ వైఎస్ఆర్ సీపీ కార్యదర్శి కొల్లు వెంకటరెడ్డి, జిల్లా నేతలు పురుషోత్తం, అహ్మద్ హుస్సేన్, ఉప్పల్ రెడ్డిలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు.


Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement