మానవ సేవే.. మాధవ సేవ
మాజీ మంత్రి వైఎస్ వివేకా
పులివెందుల : మాధవ సేవే.. మాధవ సేవ అని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని విద్యాధరి హైస్కూలులో ఆదివారం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పులివెందులలో 200 మంది సభ్యులతో ఈ సంస్థ ప్రారంభించడం శుభపరిణామమన్నారు. ఏళ్లలోపల 500 మంది సభ్యులు చేరేలా మనమందరం కృషి చేయాలన్నారు. ఈ సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
అంతకమునుపు సంస్థ కార్యాలయాన్ని లయోలా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అమల్‌రాజ్ ప్రారంభించారు. పులివెందుల మానవత సంస్థ డెరైక్టర్ సాంబశివారెడ్డి మాట్లాడుతూ 2004లో తూర్పుగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా 108 మంది సభ్యులతో స్థాపించారన్నారు. అనంతరం డెరైక్టర్లుగా సాంబశివారెడ్డి, వరప్రసాద్, రామచంద్రారెడ్డి, వెంకటస్వామిరెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, థామస్‌రెడ్డి, కొండారెడ్డి, శంకర్‌నారాయణరెడ్డి, గోపాల్‌రెడ్డి, సలహా సంఘం కమిటీ సభ్యులుగా సుబ్బారెడ్డి, సుధాకర్‌రెడ్డి, చిన్నప్ప, మల్లేశ్వరరెడ్డి, చలమారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా వెంకటనాథరెడ్డి, సుధాకర్, కృష్ణారెడ్డి, సుధాకర్‌రెడ్డిలు ప్రమాణం చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ పాల్ అంకిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, కౌన్సిలర్ వరప్రసాద్ పాల్గొన్నారు.