ఇన్ఫోసిస్ శిబులాల్ భూరి విరాళం
కొచ్చి: సేవా కార్యక్రమాలకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎస్ డీ శిబులాల్ భూరి విరాళం ప్రకటించారు. దాతృత్వ కార్యక్రమాల కోసం తమ ఫౌండేషన్లకు రూ.36 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు శిబురాల్, ఆయన సతీమణి కుమారి శిబురాల్ తెలిపారు. ఈ మొత్తాన్ని అనాధ పిల్లలకు సేవలందిస్తున్న సరోజిని దామోదరన్ ఫౌండేషన్(ఎస్ డీఎఫ్), అద్వైత ఫౌండేషన్ లకు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
తమ ఫౌండేషన్ల ద్వారా గత 15 ఏళ్లుగా శిబులాల్ దంపతులు దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. అనాధ పిల్లలకు విద్యనందించేందుకు 1995లో ఎస్ డీఎ స్థాపించారు. దీనిద్వారా ఇప్పటివరకు 3,306 విద్యార్థులకు చేయూతనందించారు.