జర్నలిస్టు ముద్దు.. లైట్ తీసుకున్న ఐష్ | journalist kissed aishwarya's hand | Sakshi
Sakshi News home page

జర్నలిస్టు ముద్దు.. లైట్ తీసుకున్న ఐష్

Published Wed, Apr 13 2016 12:18 PM | Last Updated on Thu, May 24 2018 1:33 PM

జర్నలిస్టు ముద్దు.. లైట్ తీసుకున్న ఐష్ - Sakshi

జర్నలిస్టు ముద్దు.. లైట్ తీసుకున్న ఐష్

ముంబై: భారత్‌లో బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్ టన్ దంపతుల పర్యటన సందర్భంగా ఓ షాకింగ్  సంఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ కోడలు,  హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌ పట్ల ఓ జర్నలిస్టు ప్రవర్తనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బ్రిటిష్‌ యువరాజు విలియమ్‌, ఆయన భార్య కేట్‌ మిడిల్టన్‌   పర్యటనలో భాగంగా ఓ ఛారిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో యువరాజు దంపతులతో పాటు బాలీవుడ్‌ సెలబ్రిటీలు పాల్గొన్నారు. వారిలో నీలికళ్ల సుందరి ఐష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐష్‌ను చూసిన ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్పారు. ఈ సందర్భంలో ఓ జర్నలిస్ట్‌ ఐష్‌ని విష్‌ చేయగా.. దానికి ప్రతిస్పందించిన ఐష్  హాయ్ హౌ ఆర్ యూ అంటూ ముందుకొచ్చి అతనికి షేక్ హ్యండ్‌ ఇచ్చింది. అంతే.. అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆ జర్నలిస్ట్‌ ఐష్‌ చేతిని ముద్దాడాడు. దీంతో అక్కడున్నవారంతా నివ్వెరపోయారు. ఐష్‌ మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుండా... హుందాగా నవ్వులు చిందిస్తూ ముందుకు కదిలారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement