ish
-
జర్నలిస్టు ముద్దు.. లైట్ తీసుకున్న ఐష్
ముంబై: భారత్‌లో బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్ టన్ దంపతుల పర్యటన సందర్భంగా ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కోడలు, హీరోయిన్ ఐశ్వర్యరాయ్ పట్ల ఓ జర్నలిస్టు ప్రవర్తనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. బ్రిటిష్ యువరాజు విలియమ్, ఆయన భార్య కేట్ మిడిల్టన్ పర్యటనలో భాగంగా ఓ ఛారిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో యువరాజు దంపతులతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. వారిలో నీలికళ్ల సుందరి ఐష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐష్‌ను చూసిన ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్పారు. ఈ సందర్భంలో ఓ జర్నలిస్ట్ ఐష్‌ని విష్ చేయగా.. దానికి ప్రతిస్పందించిన ఐష్ హాయ్ హౌ ఆర్ యూ అంటూ ముందుకొచ్చి అతనికి షేక్ హ్యండ్ ఇచ్చింది. అంతే.. అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆ జర్నలిస్ట్ ఐష్ చేతిని ముద్దాడాడు. దీంతో అక్కడున్నవారంతా నివ్వెరపోయారు. ఐష్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుండా... హుందాగా నవ్వులు చిందిస్తూ ముందుకు కదిలారు. -
కేన్స్ - ఐష్
కేన్స్ : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నీలికళ్ల సోయగం ఐశ్వర్యరాయ్ హల్ చల్ చేసింది. ఫిష్ కట్ ఫ్రాక్ లో మెరిసిపోయింది. 'టూ డేస్ వన్ నైట్' మూవీ ప్రీమియర్ షోకు వెళ్లి అందరినీ ఐస్ చేసింది. ఇప్పటికే పలుసార్లు కేన్స్ ఫెస్టివల్లో ఈ ప్రపంచ సుందరి తళుక్కుమన్నా, ఈ సారి మూడేళ్ల కూతురు ఆరాధ్యతో హాజరుకావడం ప్రత్యేకత. దీంతో ముగ్ధ మనోహరమైన ఐష్‌ను తమ కెమెరాలో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీలు పడ్డారు. మరోవైపు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తో వివాహం, ఒక పాపకు జన్మనిచ్చిన మూడేళ్ల తరువాత తన రెండవ ఇన్సింగ్స్ మొదలు పెట్టింది ఈ ఫ్యాషన్ ఐకాన్. దీంతో తమ అభిమాన తారను వెండితెరపై చూసేందుకు అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కాగా 68వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బాలీవుడ్ నటీమణులు సందడి చేశారు. యువ నటి సోనమ్ కపూర్, సెక్సీ బాంబ్ మల్లికా షెరావత్ సోనమ్ కపూర్ రెడ్ కార్పెట్‌పై హొయ లొలికించారు. అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ - 2015 వేడుకలు ఆదివారం ముగియనున్నాయి.