ఏపీ ప్రభుత్వానికి కాగ్ అక్షింతలు | CAG Report Gives Big Shock To Andhra Pradesh Government | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వానికి కాగ్ అక్షింతలు

Published Fri, Apr 6 2018 8:00 PM | Last Updated on Sat, Sep 22 2018 8:48 PM

CAG Report Gives Big Shock To Andhra Pradesh Government - Sakshi

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫొటో)

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత దారుణంగా ఉందో కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్(కాగ్) నివేదికతో బట్టబయలైంది. ఏపీ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని కాగ్ తమ నివేదికలో తప్పుపట్టింది. 2014-16 మధ్య కాలంలో బడ్జెట్ కేటాయింపులకు మించి చేసిన 53, 673 కోట్ల రూపాయాల అధిక వ్యయాన్ని ఇప్పటివరకూ క్రమబద్ధీకరించలేదని తేలిపోయింది. గ్రాంట్‌లకు మంచి ఖర్చు చేయడం నిబంధనల అతిక్రమణ కిందకు వస్తుందని కాగ్ స్పష్టం చేసింది. 

'చాలా పద్దుల యూసీలు అసంపూర్తిగా ఉన్నాయి. నిర్ధిష్ట కాలపరిమితిలో చాలా పద్దులకు చంద్రబాబు సర్కార్ యూసీలు చెల్లించలేదు. 2017 మార్చి 31 నాటికి 76 వేల రూపాయల రుణ బకాయిలు తీర్చాల్సి ఉంది. ఈ బకాయిలు బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. 2017 మార్చి 31 నాటికి పూర్తి కావాల్సిన 271 ప్రాజెక్టుల్లో ఆ తేదీ నాటికి ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు. ప్రాజెక్టులకు సంబంధించి తొలి అంచనాల విలువను 28, 036 కోట్ల రూపాయలు (52.06 శాతం) సవరించారు. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడంతో ఖర్చులు పెరిగాయని కాగ్ తమ నివేదికలో వెల్లడించింది.

డీపీఆర్‌ల తయారీ, ప్రాథమిక పనులు ఆరంభించక పోవడంతో 455 కోట్ల రూపాయల కేంద్రం సాయాన్ని రాష్ట్రం వినియోగించుకోలేక పోయింది. ప్రభుత్వ హడావుడి ఖర్చులు 27 నుంచి 50 శాతానికి పెరిగిపోయాయి. బోధనా వ్యవస్థపై సరైన పర్యవేక్షణ లేకుండా పోయింది. ఆరో తరగతి పిల్లలు కూడా చదవలేక పోతున్నారని, రాయలేక పోతున్నారని కాగ్ తాజా నివేదకలో ఏపీ తాజా పరిస్థితిని కళ్లకు కట్టినట్లు వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement