సాక్షి ముంబై: ఛారిటబుల్ ట్రస్టులు 2014-15, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో 18,800 కోట్ల రూపాయల పన్ను మినహాయింపులను పొందాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదిక వెల్లడించింది.ఇందులో రిజిస్టర్ కాని ట్రస్ట్‌లు 21వేలకుపైగా ఉన్నాయని తెలిపింది. అలాగే 347 ట్రస్టులు, విదేశీ సహకార నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) నమోదు కానప్పటికీ, విదేశీ విరాళాలు పొందాయని సోమవారం పార్లమెంటులో సమర్పించిన నివేదికలో కాగ్ స్పష్టం చేసింది. (Revised ITR: రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు?)
మొత్తం రూ.18,800 కోట్ల మినహాయింపులో, అత్యధికంగా రూ.4,245 కోట్ల మినహాయింపులు ఢిల్లీకి చెందిన 1345 ట్రస్టులు ఉన్నాయి. మహారాష్ట్రలో 3,745 ట్రస్టులు 2వేల 500 కోట్ల మినహాయింపును పొదవాయి.ఉత్తరప్రదేశ్‌లో 2,100 ట్రస్ట్‌లు రూ. 1,800 కోట్ల పన్ను రహిత ఆదాయాన్ని పొందగా, రూ.1,600 కోట్ల మేర చండీగఢ్‌లో 299 ట్రస్టులు పొందాయి.
మధ్యప్రదేశ్‌లో ఇటువంటి 770 కంటే ఎక్కువ ట్రస్ట్‌లు రూ. 1,595 కోట్లకు పైగా మినహాయింపును పొందాయి మరియు గుజరాత్, ఆంధ్ర మరియు కర్ణాటకలలోని ట్రస్ట్‌ల ద్వారా క్లెయిమ్ చేయబడిన ఒక్కొక్కటి రూ. 1,000 కోట్లకు పైగా మినహాయింపులు ఉన్నాయి. కనీసం 347 ట్రస్ట్‌లు ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ని లేనప్పటికీ విదేశీ విరాళాలను పొందినట్లు నివేదించింది.
సెక్షన్ 11 కింద తమ ఆదాయంపై మినహాయింపులను క్లెయిమ్ చేయడానికి చారిటబుల్ ట్రస్ట్‌లు ఐటీ చట్టంలోని సెక్షన్ 12AA కింద రిజిస్ట్రేషన్ పొందవలసి ఉంటుంది. “2014-15 నుండి 2017-18 వరకు అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించిన ఆదాయపన్ను రిటర్న్‌లకు సంబంధించి I-T (సిస్టమ్స్) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ అందించిన డేటా ప్రకారం 21,381 కేసులలో సెక్షన్ 11 కింద మినహాయింపు క్లెయిమ్ చేసినట్లు ఆడిట్ గుర్తించింది. అయితే, సెక్షన్ 12AA ప్రకారం నమోదు అందుబాటులో లేదనని నివేదిక పేర్కొంది.
ఈ ట్రస్ట్‌లు విదేశీ విరాళాలను స్వీకరించడానికి ఎఫ్‌సీఆర్‌ఏ క్రింద రిజిస్ట్రేషన్ పొందవలసి ఉంటుంది.ఎఫ్‌సీఆర్‌ఏ చట్టం కింద నమోదు చేయకుండానే అత్యధికంగా విదేశీ విరాళాలు పొందిన రాష్ట్రాల్లో కర్ణాటక, టాప్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయని ఆడిట్‌లో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment