సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో భూముల కేటాయింపులకు సంబంధించి గత చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారంగా.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తప్పుబట్టింది. చట్టం ముందు అందరూ సమానమేననే ప్రాథమిక హక్కును నాటి ప్రభుత్వం కాలరాసిందని ఘాటుగా వ్యాఖ్యానించింది.
భూముల కేటాయింపుల కోసం ఏకరీతి ధరల విధానాన్ని రూపొందించడంలో చంద్రబాబు ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైనట్లు తేల్చిచెప్పింది. ప్రభుత్వరంగ సంస్థలకు భూములను అత్యధిక ధరకు కేటాయించారని.. అలాగే ప్రైవేట్ సంస్థలకు అతితక్కువ ధరకు కేటాయించినట్లు కాగ్ ఆ నివేదికలో పేర్కొంది.
మంత్రివర్గ సూచనలూ బేఖాతరు..
ఇక రాజధాని అమరావతిలో ఫ్రీ హోల్డింగ్ ప్రాతిపదికన టీడీపీ సర్కారు 63 కేటాయింపులు చేసిందని, ఇందులో ఆరు కేటాయింపులను కాగ్ తనిఖీ చేయగా ప్రభుత్వం ఏకరీతి ధరలను ఆమోదించలేదని పేర్కొంది. భూ కేటాయింపుల్లో ఏకరీతి లేనప్పుడు ఏకపక్ష, విచక్షణతో కూడిన ధరలకు అవకాశముందని కాగ్ వ్యాఖ్యానించింది. మంత్రివర్గ ఉప సంఘం సూచించిన ధరలను కూడా పక్కనపెట్టి ఒక విధానం అంటూ లేకుండా కొన్ని సంస్థలకు ఒక ధర, మరికొన్ని సంస్థలకు మరో ధరకు భూములను కేటాయించినట్లు కాగ్ వివరించింది. ప్రైవేట్ విద్యా సంస్థలకు ఒక ధర, ప్రైవేట్ ఆరోగ్య సంస్థలకు ఇంకో ధర, బ్యాంకులకు మరో ధరకు భూములు కేటయించినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment