సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్ ) కీలక రిపోర్ట్ ఇచ్చింది. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. మందకొడిగా పనులు జరుగుతున్నా.. కాంట్రాక్టర్లలపై చర్యలు తీసుకోలేదని కాగ్ పేర్కొంది. కాంట్రాక్టర్లలకు రూ.1853కోట్లు రాయితీలిచ్చినా హెడ్‌వర్క్స్ పూర్తి చేయలేదని తెలిపింది. అటవీ పర్యావరణ అనుమతులకు సంబంధించిన నిబంధనలు అమలు కాలేదని చెప్పింది.
భూసేకరణ, పునరావాసంపై పెట్టిన ఖర్చు వివరాలు ప్రభుత్వం సమర్పించలేదని పేర్కొంది. 12ఏళ్లలో నాలుగు శాతం మాత్రమే పునరావాసం కల్పించారని తెల్చేసింది. థర్ట్‌పార్టీ క్వాలిటీ కంట్రోల్, నాణ్యత ఆడిట్లను ఏర్పాటు చేయలేదని, పోలవరంపై కేంద్ర, రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోలేదని కాగ్ వెల్లడించింది. ముంపు గ్రామాల గుర్తింపులో లోపాలు ఉన్నట్లు పేర్కొంది. నాలుగేళ్లైనా డ్యాం పనుల డిజైన్లు ఇంకా ఖరారు చేయలేదంటూ ప్రభుత్వాన్ని కడిగేసింది. కాంట్రక్టర్లకు ఇచ్చిన రాయితీలను రికవరీ చేయాలని చెప్పింది. డీపీఆర్ తయారి సమయంలో అంతా కచ్చితంగా లేదని కాగ్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment