
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు
సాక్షి, కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అవినీతి కుటుంబ పాలనగా నడుస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు విమర్శించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా చంద్రబాబు చేసిన అవినీతి ఎక్కడ బయట బయటపడుతుందో అని తమపై విమర్శలు చేస్తున్నారన్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానంటే టీడీపీకి ఉలుకెందుకని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని పథకాలకు చంద్రబాబు పేరు పెట్టుకున్నారు కానీ ఒక్క పథకానికైనా ఎన్టీఆర్ ఎందుకు పెట్టలేదన్నారు. ఏపీలో 560 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాగ్ నివేదిక ఇస్తే చంద్రబాబు ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు.