‘చంద్రబాబు వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం’ | BJP MLC madhav Comments on CM Chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం’

Published Wed, Mar 28 2018 4:49 PM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

BJP MLC madhav Comments on CM Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ తెలిపారు. అయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అమిత్‌షా రాసిన లేఖను రాజకీయంగా మాత్రమే తీసుకోవాలి కానీ, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సభలో అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారన్నారు. అఖిల సంఘాల సమావేశం విఫలమైందని, రాష్ట్రంలో ఉన్న అన్ని పక్షాలు టీడీపీని వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు.

ప్రభుత్వం చేసిన తప్పులను బీజేపీ ఎత్తి చూపుతుంటే.. తెలుగుజాతిపై దాడిగా చిత్రీకరించడం తగదన్నారు. ఢిల్లీలోని వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణలను రాజకీయ చర్చగా మారుస్తున్నారని తెలిపారు. అసెంబ్లీని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని, ఫిరాయింపులను ప్రోత్సహించిన ముఖ్యమంత్రి రాజకీయ విలువల గురించి మాట్లాడటమేంటో అర్థం కావడం లేదన్నారు. అమిత్‌షా పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఐఐ పేరుతో నిర్వహించిన సదస్సులో ఎన్ని పెట్టుబడులు వచ్చాయో బహిర్గతం చేయాలన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement