సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కాగ్ రిపోర్టుపై గతంలో కాంగ్రెస్ నేత లు, ముఖ్యంగా కేంద్ర మంత్రిగా ఉన్న రోజుల్లో ఎస్.జైపాల్‌రెడ్డి ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్యే శ్రీని వాస్‌గౌడ్‌తో కలసి మంత్రి విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ నేతలు కాగ్ నివేదికపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని కాగ్ తన నివేదికలో ఎక్కడా పేర్కొనలేదన్నారు. సాంకేతిక అంశాలను ప్రస్తావిం చిందే తప్ప.. అక్రమాలు జరిగినట్లు చెప్పలేదన్నారు. ప్రాజెక్టులతో పాటు ప్రతీ అంశంలో కాంగ్రెస్ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా... దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా గొల్ల, కురుమల గురించి ఆలోచించిన దాఖలాలు లేవన్నారు. ఈ నెల 29న పరేడ్‌గ్రౌండ్‌లో గొల్ల, కురుమల బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment