సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీలను కించపరుస్తూ మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైరయ్యారు. రాష్ట్రంలో బీసీలమందరం ఏకమవుతున్నామని స్పష్టం చేశారు. ఎక్కువగా మాట్లాడితే తెలంగాణ గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను తిరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు.
కాగా, తెలంగాణలో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అనంతరం, మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. నోరుందని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. అన్నీ బీసీ కులాల నాయకులను పిలిపించి చర్చిస్తాం. బీసీ నేతలై వ్యక్తిగత దాడులు చేస్తే ఊరుకునే ప్రస్తకే లేదు. బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడొద్దు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఏకం చేస్తాం. కుల వృత్తుల సమస్యలు, బాధలు మాకు తెలుసు. భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నాం. బాడీషేమింగ్ చేస్తే బాగోదు. హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం.
కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మాటలు నేర్పిందా?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఆత్మగౌరవ భవనాలు నిర్మించాం. రైతు బంధు, రైతు బీమా మెజారిటీ బీసీలకు అందుతోంది. కాంగ్రెస్ పార్టీ విధానమా.. సొంత ఎజెండనా అర్ధం కావడం లేదు. బీసీలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. మీ పార్టీ విధానం కదా చెప్పాలి. గ్రామల్లో కాంగ్రెస్ నాయకులను తిరగకుండా చేస్తాం. ప్రజలకు సేవా చేయాలనీ చిన్న సమాజం నుంచి వచ్చిన నాయకులం మేము. 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మాటలు నేర్పిందా? అని ప్రశ్నించారు. వ్యక్తి గత భాష ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేము తెగిస్తే దేనికైనా సిద్ధం. ఒక పద్ధతిగా ఉండాలని సైలెంట్‌గా ఉన్నాం. మమ్మల్ని నమ్మిన వాళ్లు ప్రతీ ఒక్కరు బాధ పడుతున్నారు అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్.. జీతం ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment