talasaani srinivas yadav
-
బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రా: కేటీఆర్
సాక్షి, తెలంగాణభవన్: హైడ్రాను అడ్డు పెట్టుకుని బిల్డర్లు, వ్యాపారవేత్తల నుంచి రేవంత్ సర్కార్ వసూళ్లకు పాల్పడుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే, సీఎం రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రినా? లేక బీజేపీలో ఉన్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ దిక్కుమాలిన పాలన వలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.నేడు తెలంగాణభవన్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణభవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రాను తీసుకువచ్చారు. వసూళ్ల కోసమే రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రా పేరుతో వసూలు జరుగుతున్నాయని ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ నేతలను కొట్టారు. అఖిలపక్షం సమావేశం కాదు.. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలతో మీటింగ్ పెట్టాలి. పార్టీల అభిప్రాయాలు కాదు.. ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. మూసీ సుందరీకరణ వెనుక భారీ కుంభకోణం ఉంది.అక్రమ నిర్మాణమైతే.. నా ఫాంహౌస్‌ను కూల్చేయండి. పేదల కడుపు కొట్టకుండా మూసీ సుందరీకరణ చేసుకోవచ్చు. మూసీకి పురిట్లోనే గండి కొట్టి.. హైదరాబాద్ వచ్చి సుందరీకరణ అంటున్నారు. దామగుండం నేవీ రాడార్ స్టేషన్స్‌కు అమెరికా, యూకే లాంటి దేశాలు వాడటం లేదు. పర్యావరణ ప్రేమికుల సూచన మేరకు కేబీఆర్ పార్క్ చుట్టూ ప్లై ఓవర్స్ ఆలోచనను విరమించుకున్నాం. సీఎం రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రినా? లేక బీజేపీలో ఉన్నారా?. ఉన్నట్టుండి రేవంత్‌కు దేశరక్షణ గుర్తొచ్చింది. గతంలో ఆర్మీలో ఏమైనా రేవంత్ పనిచేశాడా?.మూసీ నది పరివాహక ప్రజలకు 50 ఏండ్ల కిందట ప్రభుత్వమే పట్టాలిచ్చి రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చింది. వారి చేత నల్లా బిల్లు, కరెంట్ బిల్లు కట్టించుకుంది. మూసీ సుందీరకరణ, హైడ్రా ఏదైనా కావొచ్చు.. ఏదైనా సరే.. నిర్దిష్టమైన ఆలోచన, పద్ధతి, ప్రణాళిక లేదు. మూసీ పేరిట జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉందో దాన్ని వివరంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. దిక్కుమాలిన పాలన వలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. సీఎం దివాలాకోరు మాటల వలనే అప్పు పుట్టడం లేదని మంత్రి తుమ్మల గుర్తుంచుకోవాలి. రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డంగా ఉంటారు. కాంగ్రెస్ హయాంలోనే అనుమతిలిచ్చి.. ఇప్పుడు కూల్చుతున్నారని డిప్యూటీ సీఎంకు తెలియదా?. మోదీని చూస్తే.. రేవంత్ రెడ్డికి హడల్. సంక్షేమ పథకాలకు లేని నిధులు హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలకు డబ్బులు ఎక్కడివి?’ అంటూ ప్రశ్నించారు. -
కాంగ్రెస్ నేతలను తిరగనివ్వం.. తలసాని మాస్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీలను కించపరుస్తూ మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైరయ్యారు. రాష్ట్రంలో బీసీలమందరం ఏకమవుతున్నామని స్పష్టం చేశారు. ఎక్కువగా మాట్లాడితే తెలంగాణ గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను తిరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. కాగా, తెలంగాణలో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అనంతరం, మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. నోరుందని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. అన్నీ బీసీ కులాల నాయకులను పిలిపించి చర్చిస్తాం. బీసీ నేతలై వ్యక్తిగత దాడులు చేస్తే ఊరుకునే ప్రస్తకే లేదు. బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడొద్దు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఏకం చేస్తాం. కుల వృత్తుల సమస్యలు, బాధలు మాకు తెలుసు. భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నాం. బాడీషేమింగ్ చేస్తే బాగోదు. హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మాటలు నేర్పిందా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఆత్మగౌరవ భవనాలు నిర్మించాం. రైతు బంధు, రైతు బీమా మెజారిటీ బీసీలకు అందుతోంది. కాంగ్రెస్ పార్టీ విధానమా.. సొంత ఎజెండనా అర్ధం కావడం లేదు. బీసీలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. మీ పార్టీ విధానం కదా చెప్పాలి. గ్రామల్లో కాంగ్రెస్ నాయకులను తిరగకుండా చేస్తాం. ప్రజలకు సేవా చేయాలనీ చిన్న సమాజం నుంచి వచ్చిన నాయకులం మేము. 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మాటలు నేర్పిందా? అని ప్రశ్నించారు. వ్యక్తి గత భాష ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేము తెగిస్తే దేనికైనా సిద్ధం. ఒక పద్ధతిగా ఉండాలని సైలెంట్‌గా ఉన్నాం. మమ్మల్ని నమ్మిన వాళ్లు ప్రతీ ఒక్కరు బాధ పడుతున్నారు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్.. జీతం ఎంతంటే? -
కుక్క దాడుల ఎఫెక్ట్.. వారికి మంత్రి తలసాని వార్నింగ్!
సాక్షి, హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో అంబర్‌పేటకు చెందిన నాలుగేళ్ల వయసున్న చిన్నారి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టు కూడా స్పందించింది. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి కేసును బుధవారం సుమోటోగా స్వీకరించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో కుక్కల దాడి ఘటనలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. కుక్క కాటు నియంత్రణపై 13 అంశాలతో మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ క్రమంలో స్టెరిలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. వీధి కుక్కలను దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇదే సమయంలో హెల్ప్‌లైన్ నంబర్ 040-2111 1111 తీసుకువచ్చింది. ఇదిలా ఉండగా.. జీహెచ్ఎంసీలో వీధి కుక్కల దాడుల ఘటనలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మున్సిపల్, వెటర్నరీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. నగరంలో జరిగిన ఘటన బాధాకరం. నగరంలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. మేయర్ వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరించాయి. ప్రస్తుతం కుక్కల విషయంలో 8 ప్రత్యేక టీమ్స్‌తో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం. టోల్ ఫ్రీ నంబర్, ప్రత్యేక యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. చనిపోయిన జంతువుల దహనానికి జీహెచ్ఎంసీ సూచించిన ప్రాంతాల్లోనే దహనం చేయాలి. ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు. విమర్శలు చేసే వారికి మేము సమాధానం చెప్పాము. ట్రైనింగ్ క్యాంపు పెట్టి వీటి కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాము. మటన్, చికెన్ షాపుల వద్ద రేపటి(శుక్రవారం) నుండి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాము. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. రాత్రి సమయంలో స్పెషల్ టీమ్స్ తనిఖీల్లో ఉంటాయి. అక్కడే కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు. -
తలసాని అనుచరులతో ఉత్సవ సమితి సభ్యుల వాగ్వాదం
-
తెలంగాణ ప్రభుత్వం పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్
-
గురునానక్ జయంతి వేడుకల్లో కేటీఆర్, తలసాని
-
'అందరి చూపు తెలంగాణ భవన్ వైపే'
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మా టార్గెట్ 100 సీట్లని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం తలసాని మాట్లాడుతూ.. ఇప్పుడు అందరి చూపు తెలంగాణ భవన్ వైపే ఉందని తెలిపారు. పాత, కొత్త నాయకులం అందరం కలిసి పార్టీ విజయానికి కృషి చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారని తలసాని పేర్కొన్నారు. ప్రజలకు ఇప్పటి వరకు ప్రభుత్వం చేసినవే చెబుతున్నామని తెలిపారు. -
తలసాని వ్యవహారంపై సీఎస్‌కు రాజ్‌భవన్ లేఖ
గవర్నర్‌కు ఫిర్యాదుచేసిన ఎమ్మెల్యే గోపీనాథ్ ఫిర్యాదుతో పాటు లేఖను సీఎస్‌కు పంపిన రాజ్‌భవన్ వర్గాలు హైదరాబాద్: టీటీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, తెలంగాణరాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ భవన్లో కదలిక ప్రాంభమైంది. పార్టీ ఫిరాయింపుల కింద తలసాని పై చర్యలు తీసుకోవాలని శనివారం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మాగంటి ఫిర్యాదు పై రాజ్ భవన్ వర్గాలు సీఎస్ రాజీవ్ శర్మకు సమాచారం పంపాయి. తలసానిని మంత్రిగా కొనసాగించడంపై తరచు ఫిర్యాదులు వస్తున్నాయని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.