
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక లోటును తీర్చే క్రమంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో భాగంగానే 2017లో జాతీయ స్థాయిలో వినియోగ పన్నును ప్రవేశపెట్టారు. ఈ పన్ను ద్వారా ఆర్థిక ప్రగతి వేగవంతమవుతుందని భావించారు, కానీ పన్ను ఎగవేతల కారణంగా లక్ష్యాలు నెరవేరలేదని కాగ్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా పన్ను లక్ష్యాలపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. అయితే ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా పన్ను ఎగవేతదారులు పూర్తి స్థాయిలో పన్నులు చెల్లించకపోవడం ప్రభుత్వాలకు ఆందోళన కలిగిస్తున్నాయి.
భారత్‌లో వినియోగ వస్తువుల కారణంగానే 60శాతం వృద్ది రేటు నమోదవుతుంది. కానీ బ్యాంకింగ్ రంగంలో నిధుల లేమి కారణంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వినియాగ పన్ను వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని భావించినా నకిలీ బిల్లులు, ఆడిటింగ్ మాయాజాలంతో ఆర్థిక వ్యవస్థ మెరుగైన ఫలితాలు సాధించడంలేదని పీడబ్లూసీ అనే సంస్థలో భాగస్వామిగా ఉన్న ప్రతిక్ జైన్ తెలిపారు. జీడీపీ వృద్ది రేటు, ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు అమలు చేయడం పెద్ద సవాల్ అని నిపుణులు విశ్లేషించారు. కానీ, అభివృద్ధి చెందిన దేశాల వృద్ధితో భారత్‌ను పోల్చడం సరికాదని, త్వరలోనే ఆర్థిక వ్యవస్థలో మెరుగైన ఫలితాలు సాధిస్తుందని పబ్లిక్ ఫైనాన్స్ ప్రొఫెసర్ సచ్చిదానందా ముఖర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment