వైఎస్సార్‌సీపీ హయాంలో సామాజిక వ్యయానికి పెద్దపీట
2023–24 నివేదికలో వెల్లడించిన కాగ్
సామాజిక రంగానికి రూ.97,396 కోట్లు వ్యయం
స్థానిక సంస్థలకు ఐదేళ్లలో గ్రాంట్లు భారీగా పెరుగుదల
2019–20లో వచ్చిన గ్రాంట్లు రూ.59,915 కోట్లు
2023–24లో వచ్చిన గ్రాంట్లు రూ.91,248 కోట్లు
2019–20లో పన్నుల ఆదాయం రూ.85,843 కోట్లు
2023–24లో ఆ మొత్తం రూ.1,31,633 కోట్లకు పెరుగుదల
2023–24 రాష్ట్ర ఆర్థిక నివేదికను అసెంబ్లీకి సమర్పించిన కాగ్
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ హయాంలో సామాజిక రంగం వ్యయం భారీగా పెరిగిందని కాగ్ (కంప్టోల్రర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక స్పష్టం చేసింది. 2023–24 ఆర్థి క సంవత్సరానికి సంబంధించిన ఆర్థి క నివేదికను కాగ్ బుధవారం అసెంబ్లీకి సమర్పించింది.
సామాజికరంగ వ్యయంతో పాటు 2023–24 ఆర్థిక సంవత్సరంలో డీబీటీ ద్వారా గ్రాంట్ రూపంలో ఇచ్చిన వివరాలతోపాటు స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు గడచిన ఐదేళ్లలో గ్రాంటు రూపంలో ఇచ్చిన మొత్తం ఎలా పెరిగిందనే వివరాలను.. ఐదేళ్లలో పన్ను ఆదాయం పెరుగుదలను కాగ్ వివరించింది.
సామాజిక రంగంలో (ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, ఎస్సీ, ఎస్టీ తదితర సంక్షేమాలకు) 2022–23లో రూ.88,647 కోట్లు వ్యయం చేయగా 2023–24లో రూ.97,396 కోట్లు వ్యయం చేసినట్టు కాగ్ స్పష్టం చేసింది. అలాగే 2023–24 ఆర్థిక సంవత్సరంలో వేతనాల తరువాత అత్యధిక వ్యయం డీబీటీ ద్వారా గ్రాంటుగా ఇచ్చినట్టు వెల్లడించింది.
అలాగే రాష్ట్ర సొంత పన్నులు, కేంద్ర పన్నుల వాటా రాబడి 2019–20లో రూ.85,843 కోట్లు ఉండగా.. 2023–24 నాటికి రూ.1,31,633 కోట్లకు పెరిగినట్టు నివేదిక స్పష్టం చేసింది. అలాగే స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు గ్రాంటు రూపంలో 2019–20లో రూ.59,915 కోట్లు ఇవ్వగా.. 2023–24 నాటికి ఆ గ్రాంట్ మొత్తం రూ.91,248 కోట్లకు పెరిగినట్టు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment