సాక్షి, శ్రీకాకుళం: ఏ నాయకుడికైనా తన ప్రాంతం అభివృద్ధి చెందాలనే కోరిక ఉంటుంది. సొంత ప్రాంతం ఎదగాలనే ఆశ ఉంటుంది. కానీ టీడీపీ నాయకుల తీరు వేరు. విశాఖకు రాజధాని వస్తే ఉత్తరాంధ్ర బాగుపడుతుందని తెలిసినా.. వైజాగ్‌కు రాజధాని రాకూడదని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతిపై లేనిప్రేమ ఒలకబోస్తూ ప్రజల దృష్టి లో చులకనైపోతున్నారు. సొంత ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారు.
విశాఖను రాజధాని చేస్తే నేరమట..
సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయాలని నిర్ణయించారు. ఇక్క డ కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటైతే ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం పోతుంది. ఈ విషయం తెలిసినా టీడీపీ నాయకులు మాత్రం చంద్రబాబు చేతిలో బొమ్మల్లాగే ఆడుతున్నారు. మూడు రాజధానులపై జనం హర్షం ప్రకటించినా..ఆ నాయకులు గుర్తించలేకపోతున్నారు. విశాఖ వద్దు.. అమరావతే ముద్దు అని అంటున్నారు.
తొలుత భిన్నాభిప్రాయాలు..
మూడు రాజధానుల ప్రకటన సమయంలో శ్రీకా కుళంలో జరిగిన టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ మూడు రాజధానుల ప్రకటనను ప్రస్తావించా రు. అధికార వికేంద్రీకరణకు అడ్డు తగిలితే ప్రజాగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని చెప్పారు. రాజధానిగా విశాఖను వ్యతిరేకిస్తే అసలుకే నష్టం వస్తుందని బాహాటంగానే చెప్పారు. కానీ తర్వాత చంద్రబాబు ఏం చేశారో గానీ మాటలు మార్చేశారు.
చదవండి: (పెళ్లా...? కెరీరా...?: క్షణం ఆలోచించకుండా తేల్చేస్తున్న అమ్మాయిలు..)
సంబరాలపై మండిపాటు
మూడు రాజధానులపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. సొంత ప్రాంతానికి అన్యాయం జరుగుతుందంటే టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్న వైఖరిపై స్థానికులు నివ్వెరపోతున్నారు. ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉన్న కళా వెంకటరావు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ తదితర కీలక నేతలు మాత్రమే అమరావతి అజెండాను భుజానికి ఎత్తుకుంటున్నారు. కానీ చంద్రబాబు అజెండాను ఎత్తుకుంటే తమ రాజకీయ భవిష్యత్ పోయినట్టేనని ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.
సమాన ప్రగతి సాధించాలి..
రాష్ట్రం అన్నాక అన్ని ప్రాంతాలు సమాన ప్రగతి సాధించాలి. విద్య, వైద్యం, వ్యాపారం, పారిశ్రామిక ప్రగతి అవసరం. ఒక్క ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతమైతే ప్రాంతీ య అసమానతలు వస్తాయి. ప్రభుత్వ విధానానికి అంతా మద్దతు పలకాలి.
– ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్, పూర్వపు వీసీ, బీఆర్‌ఏయూ
వికేంద్రీకరణతోనే రాష్ట్ర ప్రగతి..
అభివృద్ధి వికేంద్రీకరణ తోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమ వుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు సమాన ప్రగ తి సాధించాలి. గతంలో రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ రూపంలో ఏపీకి తీరని అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వ విభజన చట్టాలు అమలు కాలేదు. ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. మహారాష్ట్రలో ముంబై కేంద్రంగా మొత్తం అభివృద్ధి జరిగింది. ఇప్పుడు అక్కడ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్లు వస్తున్నాయి.
– ప్రొఫెసర్ గుంట తులసీరావు, పూర్వపు రిజిస్ట్రార్, బీఆర్‌ఏయూ
Comments
Please login to add a commentAdd a comment