ఆ సమావేశానికి కర్త కర్మ క్రియ చంద్రబాబే.. | MLA Merugu Nagarjuna Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఆడే ఆటలో కీలుబొమ్మలు కావొద్దు..

Published Sun, Sep 27 2020 1:31 PM | Last Updated on Sun, Sep 27 2020 9:17 PM

MLA Merugu Nagarjuna Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఆలయాలపై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని, విభజించి పాలించడం ఆయన నైజం అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో ఆదివారం ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వైఫల్యం చెందారని, ఎప్పుడూ కుట్రలు, కుతంత్రాలు చేయడమే ఆయనకు అలవాటు అని విమర్శలు గుప్పించారు.

'విజయవాడలో ఏర్పాటు చేసిన దళిత సమావేశం చంద్రబాబు రౌండ్ సమావేశంలా ఉంది. రౌండ్ టేబుల్ సమావేశానికి కర్త కర్మ క్రియ చంద్రబాబు. చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలా ఉన్నవారే సమావేశం పెట్టారు. విభజించి పాలించు అనేది చంద్రబాబు సూత్రం. దళిత ద్రోహి చంద్రబాబు. సీఎం జగన్‌కు కులాలు మధ్య చిచ్చుపెట్టే అవసరం ఏమి ఉంది. జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో దళితులు సంతోషంగా ఉన్నారు. దళితుల్లో పుట్టాలని అన్నప్పుడే.. రౌండ్ సమావేశం పెట్టిన వాళ్లు చంద్రబాబు మొహం మీద ఉమ్ము వేయాల్సింది. రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన హర్షకుమార్ సీటు కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నాడు. సమావేశం పెట్టిన వారు నిజంగా దళితులైతే ముందు చంద్రబాబుతో క్షమాపణ చెప్పించాలి. (మత విద్వేషాలే లక్ష్యంగా బాబు ఎల్లో వైరస్‌)

చంద్రబాబు ఆడే ఆటలో దళిత నేతలు కీలు బొమ్మలు కావద్దు. దళితులపై కుట్రలు కుతంత్రాలు చేయడం చంద్రబాబుకు అలవాటు. నిన్నటి సమావేశంలో బాబూ జగజ్జీవన్ రావు ఫోటో ఎందుకు పెట్టలేదు. చంద్రబాబు దళితులను వైఎస్సార్‌సీపీకి దూరం చేయాలనే కుట్ర చేస్తున్నారు. రౌండ్ టేబుల్ సమావేశం చంద్రబాబు ఇంటి ముందు పెట్టాలి. దళిత పక్షపాతి సీఎం జగన్‌. దళిత సంక్షేమానికి ఆయన పెద్ద పీఠ వేశారు. విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తున్నారు' అని మేరుగ నాగార్జున పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement