సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో తమ జోక్యం ఉండదని మరోసారి కేంద్రం స్పష్టీకరించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొంది. సెక్షన్ 13 ప్రకారం రాజధాని అంటే ఒకటికే పరిమితం కావాలని కాదని పేర్కొంది. 2018లో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు పెట్టిందని,హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతినే రాజధాని అని చెప్పలేమని స్పష్టం చేసింది. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం అని కేంద్రం తెలిపింది. (చదవండి: అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం : వైఎస్ జగన్)
Comments
Please login to add a commentAdd a comment