
సాక్షి, తిరుపతి: మూడు రాజధానులకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి ఆద్వర్యంలో ఆర్‌డీఓ కార్యాలయం ముందు మంగళవారం కార్యక్రమం నిర్వహించారు. ఒక్క రాజధాని వద్దు, మూడు రాజధానులే ముద్దు అంటు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంద్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ,ముందు చూపుతో మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అమరావతిలో కొంత మంది స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం నిరసనలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు కూడా వారికి భూములు వెనక్కి ఇస్తామని సీఎం చెప్పారు. గతంలో చెన్నైని అభివృద్ధి చేసి పోగొట్టుకున్నామని, తర్వాత హైదరాబాదు అభివృద్ధి చేసి పోగొట్టుకున్నామన్నారు. .ఇప్పుడు అమరావతిని మాత్రమే రాజధానిగా చేస్తే అదే తప్పు మళ్లీ పునరావృతం అవుతుందన్నారు.
చదవండి: లోకేష్ పర్యటనకు టీడీపీ నేతలు దూరం
Comments
Please login to add a commentAdd a comment