సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ఖాయమని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు తగ్గట్టు విశాఖ కేంద్రంగా అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. భూమి విలువ ఆధారంగా ఇంటిపన్ను పెంచడం జరుగుతుందని పేర్కొన్నారు. మురికివాడల రహిత నగరంగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన అమలు చేస్తామని చెప్పారు. విశాఖలో భూములు తాకట్టు పెడుతున్నారని దుష్ప్రచారం జరుగుతుందని ఆయన మండిపడ్డారు.
ఇది ఈ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన పద్దతి కాదని.. కేంద్రం నుంచి నిధులు తీసుకొనేటప్పుడు ఆస్తులు గ్యారెంటీ చూపించడం సర్వసాధారణమని విజయసాయిరెడ్డి వివరించారు. జెఎన్ఎన్‌యుఆర్ఎం ఇళ్ల మరమ్మతులకు ఒక్కో ఇంటికి పదివేల రూపాయలు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలోని మొత్తం ఎనిమిది కన్వెన్షన్ సెంటర్లు నిర్మిస్తామని వెల్లడించారు. ఒక్కో జోన్‌లో ఐదు కోట్లు చొప్పున వ్యయం అంచనాలతో కన్వెన్షన్ సెంటర్లు నిర్మిస్తామన్నారు. విశాఖలో తాగునీటి సమస్య లేకుండా రూ.500 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తున్నామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
చదవండి: నూతన విద్యా విధానంతో ఎనలేని మేలు: సీఎం జగన్
రైతుల పట్ల ప్రతిపక్షానిది కపట ప్రేమ: సజ్జల
Comments
Please login to add a commentAdd a comment