
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ముందుకు 3 రాజధానుల ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది. ఉపసంహరణ బిల్లులపై చర్చకు స్పీకర్ అనుమతించారు. పరిపాలన వికేంద్రీకరణ-సమ్మిళిత అభివృద్ధి ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ రాయలసీమ, ఉత్తరాంధ్ర, వెనుకబడిన ప్రాంతాలని శ్రీకృష్ణకమిటీ చెప్పిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని మంత్రి బుగ్గన అన్నారు. కోస్తాను వెనుకబడిన ప్రాంతంగా శ్రీకృష్ణ కమిటీ చెప్పలేదన్నారు. వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యం. అందుకే అన్ని రాష్ట్రాలు వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment