సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాల్లో భాగంగా శాసన మండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకుంది. మండలి రద్దు ఉపసంహరణ తీర్మానాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో మంగళవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలి రద్దు నిర్ణయం తర్వాత సందిగ్ధత నెలకొందని తెలిపారు. దానిని తొలగించేందుకు మండలిని కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన మండలిని.. దివంతగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పునరుద్ధరించారని తెలిపారు. 2019లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ చారితాత్మక నిర్ణయాలు చట్టరూపం దాల్చాలనే ఉద్దేశంతో ఉండగా ఆలస్యం జరుగుతూ వచ్చిందని తెలిపారు. అయితే 27 జనవరి 2020 అప్పటి పరిస్థితులను బట్టి మండలి రద్దు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక కొన్ని రాష్ట్రాల్లో మండలి లేదని, మరి కొన్ని రాష్ట్రాల్లో రద్దు చేయపబడిందని బుగ్గన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment