ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం: సుందరరామశర్మ  | Sundara Rama Sharma Slams On Yellow Media Over Capital Pills Propaganda | Sakshi
Sakshi News home page

ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం: సుందరరామశర్మ 

Published Wed, Aug 25 2021 8:25 AM | Last Updated on Wed, Aug 25 2021 8:25 AM

Sundara Rama Sharma Slams On Yellow Media Over Capital Pills Propaganda - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, అమరావతి: రాజధానికి సంబంధించి పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణను వాయిదా వేయాలని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ కోరలేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నేత చుండూరు సుందరరామశర్మ స్పష్టం చేశారు. ఈ వ్యాజ్యాలు సోమవారం త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయని తెలిపారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌తో పాటు చాలా మంది పిటిషనర్లు వాయిదా వేయాలని కోరారని చెప్పారు.

చదవండి: సిలికా శాండ్‌ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించండి

శ్యాం దివాన్‌కి సుప్రీంకోర్టులో కొన్ని కేసులు ఉండటం వల్ల, మిగతా పిటిషనర్లు రకరకాల కారణాలతో వాయిదా కోరారని తెలిపారు. కానీ ఏజీ శ్రీరామ్‌ మాత్రం ఏ రోజు అయినా ఈ కేసు విచారణలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని, కోవిడ్‌ పరిస్థితులను బట్టి కోర్టు నిర్ణయం తీసుకోవాలని తెలిపారని చెప్పారు. కానీ ఓ దినపత్రికలో వ్యాజ్యాలపై విచారణను వాయిదా వేయాలని ఏజీ శ్రీరామ్‌ కోర్టును కోరినట్లు వార్తను ప్రచురించారని, ఇది ఎంతమాత్రం వాస్తవం కాదన్నారు. ఎల్లో మీడియా ఉద్దేశ పూర్వకంగా ఈ ప్రచారం చేస్తోందన్నారు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement