సాక్షి, అమరావతి: మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయపరమైన చిక్కుల వల్లే ఈ పరిస్థితి ఉండొచ్చు. కేబినెట్ సమావేశంలో నేను లేను. పూర్తి వివరాలు తెలీదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే. శుభం కార్డుకు చాలా సమయం ఉంది. రాజధాని పేరుతో ఉద్యమం చేసేది పెయిడ్ ఆర్టిస్టులే అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
చదవండి: (మూడు రాజధానులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం)
ఇదే విషయంపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. కొందరు కోర్టుకెళ్లి అడ్డంకులు సృష్టించారు. అమరావతిపై ఏపీ కేబినెట్‌లో చర్చించాం. కేబినెట్ నిర్ణయాన్ని అసెంబ్లీలో వివరిస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు.
చదవండి: (ఆ కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం.. ఒక ఉద్యోగం: సీఎం జగన్)
కాగా, మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ అధికారికంగా ప్రకటిస్తారని ఏజీ కోర్టుకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment