సాక్షి, అమరావతి: 13 జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమని మున్సిపల్ శాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మూడు రాజధానులపై టీడీపీ కావాలనే.. దుష్ప్రచారం చేసిందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల మనోభావాలు, ఇతర సీఎంల కాలంలో వేసిన మంత్రుల కమిటీ అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారని బొత్స సత్యనారాయణ తెలిపారు.
తాము.. త్వరలోనే వికేంద్రీకణకు సంబంధించి పూర్తి స్థాయి బిల్లుతో ప్రజల ముందుంటామని పేర్కొన్నారు. చిత్తశుద్ధితోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు. మంచి నిర్ణయం తీసుకున్న.. టీడీపీ కావాలనే అపోహలు సృష్టించిందని విమర్శించారు. చంద్రబాబు.. కరకట్టపై ఉన్న రోడ్డునే అభివృద్ధి చేయలేదని , తాము అన్ని విధాలా అభివృద్ధి చేస్తామంటే మాత్రం అడ్డుపడుతున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు.
ముఖ్యమంత్రి ఒకచోట నుంచే పాలించాలని రాజ్యంగంలో ఎక్కడైనా.. ఉందా? అని మంత్రి బొత్స ప్రశ్నించారు. బీజేపీ ద్వంద్వవైఖరీని ప్రదర్శిస్తోందని.. పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఎలా వచ్చారని ప్రశ్నించారు.
రాజధానుల బిల్లు అంశంపై.. తమకు తడబాటు గానీ.. ఎడబాటు లేదని మంత్రి బొత్స తెలిపారు. త్వరలోనే పకడ్భందీగా బిల్లును రూపొందించి ప్రజల ముందుకు వస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment