భారతదేశం భిన్నత్వం కలిగిన దేశం. దేశంలోని ప్రతీ నగరానికి తనదైన కథ ఉంటుంది. కొన్ని నగరాలు అక్కడి ఆహారానికి ప్రసిద్ధి చెందగా, మరికొన్ని సాంస్కృతిక వారసత్వానికి పెట్టిందిపేరుగా నిలిచాయి. దేశంలోని ఏ నగరానికి వెళ్లినా అక్కడ ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అయితే మన దేశంలో ‘వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే ఒక నగరం ఉందనే సంగతి మీకు తెలుసా?
మహారాష్ట్రలోని నాసిక్ నగరాన్ని ‘వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. అంటే భారతదేశ మద్యం రాజధాని. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మద్యంలో ఎక్కువ భాగం ఈ నగరంలోనే తయారవుతుంది. ఈ నగరంలో 52 వైన్ ప్లాట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 18 వేల ఎకరాల్లో ద్రాక్షసాగు చేస్తున్నారు. దీనిలో అధిక భాగం వైన్ తయారీకి ఉపయుక్తమవుతుంది.
నాసిక్‌లోని నేల రెడ్ లేటరైట్ రకానికి చెందినది. అంతే కాదు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఎంతో మెరుగ్గా ఉంది. ద్రాక్ష సాగుకు అవసరమైన నీటి పరిమాణం. మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా, ఇక్కడ ద్రాక్ష విరగకాస్తుంది. ఒక నివేదిక ప్రకారం ఈ నగరంలో ప్రతి సంవత్సరం 20 టన్నులకు పైగా ద్రాక్ష ఉత్పత్తి జరుగుతుంది.
ఇది కూడా చదవండి: ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ ఏమిటి? ఎవరికి ప్రయోజనం?
Comments
Please login to add a commentAdd a comment