grape fruit
-
దేశంలో మద్యం రాజధాని ఏది?
భారతదేశం భిన్నత్వం కలిగిన దేశం. దేశంలోని ప్రతీ నగరానికి తనదైన కథ ఉంటుంది. కొన్ని నగరాలు అక్కడి ఆహారానికి ప్రసిద్ధి చెందగా, మరికొన్ని సాంస్కృతిక వారసత్వానికి పెట్టిందిపేరుగా నిలిచాయి. దేశంలోని ఏ నగరానికి వెళ్లినా అక్కడ ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అయితే మన దేశంలో ‘వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే ఒక నగరం ఉందనే సంగతి మీకు తెలుసా? మహారాష్ట్రలోని నాసిక్ నగరాన్ని ‘వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. అంటే భారతదేశ మద్యం రాజధాని. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మద్యంలో ఎక్కువ భాగం ఈ నగరంలోనే తయారవుతుంది. ఈ నగరంలో 52 వైన్ ప్లాట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 18 వేల ఎకరాల్లో ద్రాక్షసాగు చేస్తున్నారు. దీనిలో అధిక భాగం వైన్ తయారీకి ఉపయుక్తమవుతుంది. నాసిక్‌లోని నేల రెడ్ లేటరైట్ రకానికి చెందినది. అంతే కాదు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఎంతో మెరుగ్గా ఉంది. ద్రాక్ష సాగుకు అవసరమైన నీటి పరిమాణం. మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా, ఇక్కడ ద్రాక్ష విరగకాస్తుంది. ఒక నివేదిక ప్రకారం ఈ నగరంలో ప్రతి సంవత్సరం 20 టన్నులకు పైగా ద్రాక్ష ఉత్పత్తి జరుగుతుంది. ఇది కూడా చదవండి: ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ ఏమిటి? ఎవరికి ప్రయోజనం? -
హృదయమున్న ద్రాక్ష!
ద్రాక్షపండు కేవలం రుచి విషయంలోనే కాదు... ఆరోగ్య ప్రయోజనాల విషయంలోనూ తనకు తానే సాటి. ద్రాక్షతో ఒనగూరే లాభాల్లో ఈ కింద పేర్కొన్నవి కొన్ని మాత్రమే.మనుషుల్లో యాంజియోటెన్సిన్ అనే ఒక రకం హార్మోన్‌కు రక్తనాళాలను సన్నబార్చే గుణం ఉంది. ద్రాక్షపండు ఆ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ విధంగా కూడా ద్రాక్ష గుండెజబ్బులను నివారిస్తుంది. ద్రాక్షలోని కేటెచిన్ అనే యాంటీ యాక్సిడెంట్ కూడా అనేక విధాల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. రక్తనాళాలను తెరచుకొని ఉండేలా చేసే నైట్రిక్ ఆక్సైడ్‌ను ద్రాక్షపండ్లు వెలువరిస్తాయి. తద్వారా అవి రక్త ప్రవాహం సాఫీగా జరిగేలా చూస్తాయి. ఇలా కూడా అవి గుండెజబ్బులను దరిచేరకుండా చేస్తాయి. అంటే ద్రాక్షపండు ఇలా అనేక మార్గాల్లో గుండెకు మేలు చేస్తుందన్నమాట. -
చార్మిరాకిల్
షెహర్ కీ షాన్ ద్రాక్ష పండ్ల గుత్తిని అందుకుని ఆకలితీరా ఆరగించేందుకు అనుమానపు చూపులతో భయంభయంగా గెంతుతున్న ఉడతలు... అవి ఆ పండ్లను మాయం చేసేలోపు కొన్నింటిని నోటగరుచుకునేందుకు కాచుక్కూర్చున్న పక్షులు. ఆధారాన్ని అల్లుకుని ఎగబాకిన లతలు.. వాటికి విరబూసిన పూలు.. నిండుగా విచ్చుకుని కనువిందు చేసే గులాబీలు.. గుదిగుచ్చి పేర్చిన పూలగుత్తులు... ఈ అందం ఎక్కడిదో కాదు... నగర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చార్మినార్‌ది. చార్మినార్ అనగానే... అది హైదరాబాద్‌కు ల్యాండ్‌మార్క్, నాలుగు మినార్లు ప్రధానాకర్షణగా నిర్మించిన కట్టడంగానే చాలామందికి తెలుసు. కానీ ఆ నిర్మాణ కౌశలాన్ని ఓసారి పరిశీలిస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. పర్షియన్ నిర్మాణ శైలితో రూపొందిన ఈ కట్టడం పై అంతస్తులో పనితీరు... దాని సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవేమో అనిపిస్తుంది. ప్రపంచ నలుమూలల్లో కనిపించే ప్రత్యేకతలన్నీ హైదరాబాద్‌లో కొలువుదీరాలని కలలుగన్న కుతుబ్‌షాహీలు ఈ కట్టడం విషయంలోనూ అదే పంథాను అనుసరించారు. పర్షియా నుంచి ఇంజినీరింగ్ నిపుణులను పిలిపించి దానికి ప్రణాళిక రూపొందించడమే కాకుండా... అది సాధారణ కట్టడంగా ఉండకూడదన్న ఉద్దేశంతో అడుగడుగునా సోయగాలద్దించారు. రెండో అంతస్తులో ప్రత్యేకంగా నిర్మించిన మసీదు గోడలపై నిజంగా గులాబీ కొమ్మలు వేలాడుతున్నాయా అనేంత సహజంగా తీర్చిదిద్దారు. మరికొన్ని కళాఖండాలను పరిశీలిస్తే... గోడలకు అతికించారా అన్న అనుభూతి కలుగుతుంది. ఒకే గోడకు రెండు డిజైన్లు ఉంటాయన్నమాట. చార్మినార్ అనగానే మనకు నాలుగు మినార్లే తెలుసు. కానీ రెండో అంతస్తు పైభాగానికి వెళ్తే చిన్నచిన్న మినార్లు మరిన్ని కనిపిస్తాయి. కింది నుంచి పై వరకు రకరకాల డిజైన్లతో వాటిని తీర్చిదిద్దారు. ఆ గోడలపై నాలుగు వైపులా లతలు, పూలు, వాటిపై సేదతీరే ఉడతలు, పక్షులు, పైభాగంలో వేళాడుతున్నట్టుగా తామర మొగ్గలు... ఇలా ఒకటేమిటి... ఒకదాన్ని మించింది మరొకటి. గతంలో ఓ కుటుంబం చార్మినార్ పైభాగం నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవటంతో అక్కడికి సందర్శకులను అనుమతించటం లేదు. దీంతో ఈ సౌందర్యం చూసే అవకాశం లేకుండా పోయింది. అందుకే మీ కోసం ఈ ప్రయత్నం. ఫొటోలు: అమర్ గౌరీభట్ల నరసింహమూర్తి