
సాక్షి, విశాఖపట్నం: త్వరలోనే విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగిన తర్వాత విశాఖ రాజధాని అవుతుందన్నారు. ‘‘చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తారు. వరద నీటిని పట్టుకుని తాగునీరు అంటూ మాట్లాడతారా? అంటూ దుయ్యబట్టారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుందన్నారు.
చదవండి: మరోసారి అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు.. అసలు రహస్యం బట్టబయలు
సింగర్ శ్రావణి భార్గవి పాట వివాదంపై..
సింగర్ శ్రావణి భార్గవి పాట వివాదంపై వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. ఇది టీటీడీకి సంబంధించినది కాదని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాటి మీద ఏ విధంగా స్పందిస్తామని ఆయన ప్రశ్నించారు. వేంకటేశ్వరస్వామికి ప్రియ భక్తుడైన అన్నమయ్య పాటకు అపచారం కలిగించడం అంటే మహాపాపం. తొలి వాగ్గేయకారుడిగా అన్నమయ్యను గౌరవించుకుంటున్నాం. అన్నమయ్య పేరు మీద జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment