
ఇటీవల మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన బాలీవుడ్ హాట్ కపుల్ రణవీర్ సింగ్, దీపిక పదుకొనే ఇప్పటికీ ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో ఉంటూనే ఉన్నారు. తాజాగా దీపికకు సంబంధించిన రణవీర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి ముందు రణవీర్‌కు బాలీవుడ్‌లో ప్లేబాయ్ ఇమేజ్ ఉంది. ఎప్పుడై లేట్ నైట్ పార్ట్సీ, ఫ్రెండ్స్‌తో తెగ ఎంజాయ్ చేయటం రణవీర్‌కు అలవాటు. అయితే పెళ్లి తరువాత అలాంటివి కుదరదంటూ షరతులు పెట్టిందట దీపిక.
తాజాగా పెళ్లి తరువాత దీపిక పెట్టిన షరతులపై రణవీర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. పెళ్లి తరువాత దీపిక తనకు మూడు షరుతలు విధించిందని చెప్పాడు రణవీర్. ఇంటికి వీలైనంత త్వరగా వచ్చేయాలి, ఇంట్లో తినకుండా బయటకు వెళ్లకూడదు, తను ఎప్పుడు ఫోన్ చేసిన వెంటనే కాల్ అంటెండ్ చేయాలి.. అంటూ మూడు కండిషన్స్ దీపిక పెట్టిందని రణవీర్ చెప్పాడు. ఇప్పటికే రణవీర్‌ను దీపిక డామినేట్ చేస్తుందన్న వార్తలు బాలీవుడ్‌లో జోరుగా షికారు చేస్తున్న సమయంలో రణవీర్ చెప్పిన కండిషన్స్ ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి.